FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
News

నేడు సినీ నటులు జె.వి.సోమయాజులు గారి వర్థంతి

by Admin April 27, 2021
791

ప్రసిద్ధ రంగస్థల, సినీ నటులు
జొన్నలగడ్డ వెంకట సోమయాజులు
(జె.వి.సోమయాజులు)
30-6-1928 ◆ 27-4-2004
(ఈరోజు వారి వర్థంతి)

తెలుగు ప్రేక్షక హృదయాల్లో శంకరాభరణం శంకరశాస్త్రి గా పేరుగాంచిన సోమయాజులు
శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం లుకలాం గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు శారదాంబ, వెంకటశివరావు లు. ఈయన సోదరుడు చలనచిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ నటుడు జె.వి.రమణమూర్తి. ఇతని తండ్రి ప్రభుత్వోద్యోగి. సోమయాజులు విజయంనగరంలో చదువుకొన్నప్పటినుండి నాటకాలు వేసేవారు. తన సోదరుడు రమణమూర్తితో కలిసి గురజాడ అప్పారావు ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కాన్ని 45 యేళ్ళలో 500 ప్రదర్శనలు ఇచ్చారు.

ముఖ్యంగా కన్యాశుల్కంలో ‘రామప్ప పంతులు’ పాత్రకు ప్రసిద్ధుడయ్యారు. సోమయాజులు తల్లి శారదాంబ అతనిని ప్రోత్సహించింది. జె.వి.సోమయాజులు స్వయంకృషితో నట ప్రస్థానాన్ని ప్రారంభించారు. తాను నమ్మిన నాటకరంగాన్ని విస్మరించకుండా, నిబద్ధతతో నాటక రంగానికి అంకితమయ్యారు. తనసోదరుడు జె.వి.రమణమూర్తితో కలిసి కృషి చేశారు. వీరికి వేదుల జగన్నాథరావు అండదండలు లభించాయి. 1946 నుండి పెళ్ళిపిచ్చి, దొంగాటకం నాటక ప్రదర్శనల్ని ప్రారంభించారు. తర్వాత కన్యాశుల్కం నాటకం ఆడటానికి ప్రయత్నాలు ప్రారంభించారు.

తొలి ప్రదర్శన వేయడానికి రెండున్నర సంవత్సరాల కాలం పట్టింది. 1953 ఏప్రిల్‌ 20వ తేదీన
‘కన్యాశుల్కం’ నాటకాన్ని తొలి ప్రదర్శన ఇచ్చారు. ఈ నాటకంలో రామప్ప పంతులు పాత్ర పోషించి ధీరగంభీర స్వరంతో సహనటులందరికీ ఆదర్శంగా నిలిచారు సోమయాజులు.
దీనితర్వాత ఆంధ్రనాటక కళాపరిషత్తులో బహుమతులు గెలుచుకుని ప్రతిభను మరింతపదును పెట్టుకోవాలనే పట్టుదలతో మనిషిలో మనిషి, నాటకం, పంజరం, గాలివాన, కప్పలు లాంటి నాటకాలను తీర్చిదిద్ది పోటీలలో నిలిచారు. లక్ష్యాలను సాధించారు. కీర్తిని ఆర్జించారు. ఎన్నో బహుమతులు గెలుచు కున్నారు.

రెవిన్యూశాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ డిప్యూటీ కలెక్టర్‌ స్థాయికి చేరుకున్నారు. మహబూబ్‌నగర్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రోజులలోనే ఆయనకు శంకరాభరణం సినిమాలో నటించే అవకాశం వచ్చింది.
ఈ సినిమాకు ముందే దర్శకుడు యోగి రూపొందించిన ‘రారాకృష్ణయ్య’ సినిమాలో ఓ ముఖ్య పాత్రను ధరించారు. ఇది మంచి చిత్రంగా పేరుగాంచినా, ఆర్థికంగా విజయవంతం కాలేదు. అందుకే ఈ సినిమా గురించి పెద్దగా చెప్పుకోలేదు. శంకరాభరణం సినిమాలోని శంకరశాస్త్రి పాత్ర ద్వారా ఆయన ఎంతో పేరు, ప్రఖ్యాతులు గడించారు.

దీనితర్వాత 150 సినిమాల్లో రకరకాల పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయినప్పటికీ, ఇప్పటికీ సోమయాజులు గారికి చిరస్థాయిగా మిగిలిన చిత్రం ‘శంకరాభరణమే’. త్యాగయ్య వంటి సినిమాలో ఆయన ముఖ్యపాత్ర పోషించినా, ఈ చిత్రం రాణింపుకు రాలేదు. అలాగే ‘సప్తపది’కూడా ఆయన ప్రతిభకు గుర్తింపు తీసుకురాలేదు. ‘వంశవృక్షం’ సినిమాకూడా మంచి గుర్తింపు తెచ్చి పెట్టలేదు.
‘శంకరాభరణం’ విజయవంతమైన తర్వాత, రెవిన్యూ సర్వీసులో డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో పదవీ బాధ్యతల్ని నిర్వహిస్తూ ప్రభుత్వ అనుమతి లేకుండా సినిమాల్లో నటిస్తున్నారని, ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన పరిశీలించి,

సాంస్కృతిక శాఖను ఏర్పరచి ఆ శాఖకు తొలి డైరెక్టర్‌గా సోమయాజులును నియమించారు.
రాష్ట్ర సాంస్కృతిక డైరెక్టర్‌ హోదాలో పదవీ విరమణ చేసిన ఈ కళాకారుడిని పొట్టిశ్రీరాములు
విశ్వవిద్యాలయం గౌరవించింది. అక్కడి రంగస్థల కళల శాఖకు సోమయాజులు అధిపతిగా
నియమితులయ్యారు.

ఈ క్రమంలోనే 1993 మార్చి 8వ తేదీన రసరంజని నాటక కళాసంస్థను నెలకొల్పారు.
ప్రతిరోజూ నాటకాన్ని ప్రదర్శించాలనీ, టికెట్‌ కొని నాటకాన్ని చూసే ఆదర్శాన్ని పెంపొందించాలనే సదాశయంతో రసరంజని స్థాపన జరిగింది. హైదరాబాద్‌లో నాటకరంగ వికాసానికి ఈ సంస్థ ఎంతో కృషి చేసింది. ఈ క్రమంలో జెవి సోమయాజులు అందించిన సేవలు చెప్పుకోదగింది.

శంకరాభరణం సినిమాలో ‘శంకరశాస్త్రి’ పాత్రతో ప్రసిద్ధుడైన తర్వాత అనేక తెలుగు చిత్రాల్లోనే కాక
కన్నడ, తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లోనూ నటించారు. టెలివిజన్ ప్రసారం కోసం కన్యాశుల్కాన్ని13 భాగాల నాటకంగా రూపొందించారు.
150 సినిమాల్లో నటించినా, టివి సీరియల్స్‌లో కూడా ఎన్నో పాత్రలు ధరించారు. చివరి శ్వాసవరకు నటనమీద గౌరవంతో ఆరాధనాభావంతో జీవించారు. చివరిదశలో

ఆరోగ్యం సహకరించక పోయినా చేయగలిగినంత చేశారు. కళాకారుడు కడవరకు కళాకారుడేనని సోదాహరణంగా నిరూపించిన వీరు 2004 ఏప్రిల్‌ 27వ తేదీన ఈ లోకంనుండి నిష్క్రమించారు🌹🤝

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

ఆ స్టార్ హీరోల సినిమాలకు ఇంకా శాటిలైట్ హక్కులు దక్కలేదట..!

ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా సెకండ్ డే కలెక్షన్స్ ఎంతో...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Meenakshi Chaudhary Latest Photos

  • 2

    Vishnu Priya Latest Photoshoot Pics

  • 3

    Krithi Shetty Latest Photos

  • 4

    Anasuya Latest Photos

  • 5

    Kushi Music Concert Photos HD

  • 6

    Telugu Anchor Manjusha Latest Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews