రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా ఎలాంటి ట్వీట్ చేసిన అది పెద్ద సంచలనమే. ఒక్కప్పుడు మరియు ఇప్పుడు ఉన్న రామ్ గోపాల్ వర్మ కు చాలా తేడా ఉంది. సోషల్ మీడియాను ఏ విదంగా ఉపయోగించు కోవాలో ఆర్‌జివి కి బాగా తెలినట్లుగా ఎవరికి తెలియదు. నిత్యం వార్తల్లో ఉండే వర్మ మరోసారి ఓ అమ్మాయి టీ షర్ట్ పై తన కొంటె ట్వీట్ తో హాట్ టాపిక్ అయ్యాడు.
ఇంతకు ఆ అమ్మాయి టీ షర్ట్ పై ఏముంది అంటే 2019 లో నెగటివ్ పీపుల్స్ ను దూరం పెట్టాం. 2020 లో పాజిటివ్ పీపుల్స్ ను దూరం పెట్టాం. 2021 లో మనషులనే దూరం పెడుతున్నాం అని రాసి ఉంది. అందుకు ఆర్‌జివి 2022 లో అసలు మనషులు ఉండకపోవచ్చు అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ వెనుక ఉన్న కారణం ఏమిటో మీకు ఇప్పటికే అర్థం అయి ఉంటుంది అనుకుంటా… దేశ వ్యాప్తంగ చాలా మంది ప్రజలు కరోనా భారీన పడి చనిపోతున్నారు.
ఇండియా లో సరైన ఆరోగ్య వసతులు లేక ప్లే గ్రౌండ్స్ ను మరియు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ ను కోవిడ్ షెడ్ లుగా మార్చి వారికి చికిత్స అందిస్తున్నారు. చాలా మందికి ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం ఇండియా లో చాలా దయనీయమైన పరిస్థితి ఏర్పడింది. అందుకే 2022 లో కరోనా ఇలాగే కొనసాగితే మనుషులే ఉండకపోవచ్చు అనేది ఆర్‌జివి ఉద్దేశ్యం.
ఆర్‌జివి సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆర్‌జివి దెయ్యం అనే సినిమాను విడుదల చేశాడు. ఆ చిత్రం నిరాశ పరిచింది. ఆర్‌జివి అభిమానులు మాత్రం ఆర్‌జివి నుండి కమర్షల్ సినిమా రావాలని కోరుకుంటున్నారు. కానీ ఆర్‌జివి అలాంటి సినిమాలకు చాలా దూరం గా ఉంటాడు. తనకు నచ్చిన పని, తనకు తోచిన పని చేసుకుంటూ పోతుంటాడు. ఇప్పట్లో ఆర్‌జివి నుండి మంచి సినిమాలు అంటే కష్టమే అని చెప్పాలి. ఆయన మంచి సినిమా చెయ్యాలి అనుకున్న ముందుకు వచ్చే హీరోలు కూడా ఎవరు లేరు. ఆర్‌జివి తో సినిమా అంటేనే భయపడిపోతున్నారు.