దేశ వ్యాప్తంగ కరోనా వైరస్ సెకండ్ స్టేజ్ యమ స్పీడ్ గా వ్యాపిస్తుంది. ప్రజల ఈ వైరస్ భారీన పడి తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. కరోనా కట్టడికి ఫ్రంట్ లైన్ వర్కర్స్ ముందు ఉండి పోరాడుతున్నారు. సామాన్య ప్రజలు మొదలుకొని సెలబ్రేటీల వరకు ఈ వైరస్ భారీన పడుతున్నారు. దేశంలో సరైన వైధ్యం, మెడిసిన్, ఆక్సిజన్ కొరత ఎక్కువ ఉండటం వలన అందరికీ అన్నీ అందించలేకపోతున్నారు.
ఈ కరోనా వైరస్ భారీన సినిమా ప్రముఖులు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సినిమా నటుడు. టివి జర్నలిస్ట్ అయిన టిఎన్‌ఆర్ కరోనాతో మృతి చెందడం అందరిని తీవ్ర ద్రిగ్బ్రాంతికి గురిచేసింది. అలాగే మరో యువ నటుడు రాహుల్ కూడా కరోనా తో పొరాడి ప్రాణాలు కోల్పోయాడు. డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ జీవితంపై ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఆరు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నాడు.
ఇటీవలే కరోనా సోకడంతో సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తుండటంతో హాస్పిటల్లో చేరాడు. రాహుల్ సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ ను పెట్టాడు మంచి వైధ్యం అందితే తాను బ్రతుకుతాని కానీ ఇప్పుడైతే ఆ ఆశ కూడా పోయింది మరల జన్మ అంటూ ఉంటే మంచి పనులు చేస్తాను అంటూ కాసేపటి క్రితమే కన్ను మూశాడు. ఈ విషయాన్ని థియేటర్ డైరెక్టర్ ప్లేరైట్ అరవింద్ గౌర్ ఫేస్ బుక్ ద్వారా తెలియజేశాడు.