FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

ఓ మలయాళీ ఇన్‌ఫ్లూయెన్సర్‌కు పాట పాడే అవకాశం ఇచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ !

by Admin April 5, 2021
731

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో  మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రకటించిన రోజు నుంచి కూడా ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్‌కు, అలానే  గోపీ సుంద‌ర్ సంగీత‌ సార‌ధ్యంలో హ్యాపెనింగ్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన మనసా మ‌న‌సా పాటకు, ఆ తర్వాత విడుదల చేసిన టీజ‌ర్‌కు అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్‌లో కొత్త ఉత్సాహ‌న్ని తెచ్చింది. ఇదే ఉత్సాహంతో అక్కినేని అభిమానులకు మరో స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలోని ఏ జిందగీ పాటను విడుదల చేసారు. 

ఈ పాటకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ పాటను మలయాళీ ఇన్‌ఫ్లూయెన్సర్‌ పాడారు. ఓ మలయాళీ ఇన్‌ఫ్లూయెన్సర్‌కు పాట పాడే అవకాశం ఇచ్చిన మొట్టమొదటి బ్యానర్ గీతా ఆర్ట్స్ 2.ఆ అమ్మాయి పేరు నఫీసా హాన్యా. విడుదలైన క్షణం నుంచి కూడా ఏ జిందగీ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ సినిమాను జూన్ 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు.

ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అఖిల్ అక్కినేని, పూజాల మధ్య కూడా అలాంటి కెమిస్ట్రి ఉండేలా డిజైన్ చేసారు.

0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Anasuya Latest Photos

  • 2

    SIIMA Awards 2023 Pressmeet Photos

  • 3

    Krithi Shetty Latest Photos

  • 4

    Tollywood Actress Kajal Agarwal Interview Photos

  • 5

    Meenakshi Chaudhary Latest Photos

  • 6

    Kushi Music Concert Photos HD

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews