కమెడియన్ అలీ ఈటివి లో “అలీతో సరదాగా” అనే షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ షో కు ప్రేక్షకుల నుండి విపరీతమైన ఆదరణ లభిస్తుంది. అందుకు అలీ గారి కృషి ఎంతగానో ఉంది. మొదటి నుండి అలీ సినిమా ఫీల్డ్ లో ఉండటంతో ఆనాటి పాత తరం నటుల నుండి నేటి తరం యువ నటులు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, కమెడియన్స్ ను ఇలా సినిమా ఫీల్డ్ లో సెలబ్రేటీలు అయిన ప్రతి ఒక్కరినీ తన షో కు ఆహ్వానించి ఎన్నో మంచి విషయాలను వారి నుండి అడిగి ప్రేక్షకులకు తెలియజేస్తున్నాడు.
ఈ వారం “అలీతో సరదాగా” షో కు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టులు సురేఖవాని, రజిత లు వచ్చారు. రీసెంట్ గా విడుదలైన ప్రోమో చూస్తే అర్థం అవ్వుతుంది. సురేఖవాని గారి గురించి ప్రత్యేకంగ చెప్పాలిసిన పనిలేదు. సోషల్ మీడియా ద్వారా ఎంత ఆక్టివ్ గా ఉంటారో మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. తల్లి కూతుళ్లు కలిసి హాట్ హాట్ వీడియో లు, ఫోటోలు నిరంతరం పోస్ట్ చేస్తూనే ఉంటారు. ఈ సందర్భంగా షో కు వచ్చిన అలీ ఆమె గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాడు.
అలీ కాంట్రవర్సీకి సురేఖవాని కేరాఫ్ అడ్రస్ అని అడగ్గా అందుకు పక్కన ఉన్న రజిత సోషల్ మీడియాలో సురేఖ కు మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు అంది. మరో ప్రశ్నగా అతి త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్న సురేఖవాని … అతను ఎవరో మీరే చూసి పెట్టండి అంది. అలాగే మనసున్న వ్యక్తి కావాలా డబ్బులు ఉన్న వ్యక్తి కావాలంటే టక్కున మనసు తో పనిలేదు డబ్బులు ఉంటే సరిపోతుంది అన్నారు. సురేఖ మొదటి భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే..
అలీ మూడోవ ప్రశ్నగా మీ అత్తగారి ఇంటి నుండి మీకు ఏమైనా సాయం అందుతుందా… సురేఖవాని మాట్లాడుతూ ఒక్క రూపాయి కూడా సాయం చెయ్యలేదు. నన్ను నా కూతురును కావాలనే బ్లేమ్ చేశారు. ఈ షో వారి చూసి ఉంటే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలని అన్నారు. నా భర్త బ్లడ్ గడ్డ కట్టడంతో చనిపోయాడు అంటూ ఎమోషన్ అయ్యింది. పూర్తి ఎపిసోడ్ కోసం వచ్చే సోమవారం వరకు అగాలిసిందే.