FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

ఉగాది పర్వదినాన సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ నెంబర్ 2. చిత్రం ప్రారంభం

by Admin April 13, 2021
835

శ్రీమతి వీణదారి సమర్పణలో నేహా శ్రీ క్రియేషన్స్,సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ పతాకంపై నూతన నటీనటులతో రాజ్ కృష్ణ దర్శకత్వంలో సతీష్ కుమార్.ఐ, కళ్యాణ్ సుంకరలు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రానికి  ఆర్ పి పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా,కమెడియన్ అలీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు సతీష్ వేగేశ్న ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

నిర్మాత సతీష్ కుమార్.ఐ మాట్లాడుతూ… నేను ఇంతకు ముందు తీసిన సినిమా తో ఎం చేయాలి ఎం చేయకూడదో నేర్చుకొని ఈ రెండవ సినిమా చేస్తున్నాను. ఉగాది పర్వదినాన మా  ప్రొడక్షన్ నెంబర్ 2 సినిమాను ప్రారంబించడం మాకు చాలా సంతోషంగా ఉంది.నాకు ఎప్పటి నుండో మంచి మిత్రుడైన యూ మీడియా కళ్యాణ్ సుంకర ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్ గా పరిచయం చేస్తూ. తనతో కొలబ్రేట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.అలాగే చాలా సంవత్సరాల తర్వాత నా చిరకాల మిత్రుడు ఆర్ పి పట్నాయక్ మళ్ళి మా సినిమాతో కం బ్యాక్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది..మా చిత్ర దర్శకుడు రాజ్ కృష్ణ తేజ గారి దగ్గర పలు చిత్రాలకు వర్క్ చేశాడు.సురేష్ ప్రొడక్షన్ లో ఫిల్మ్ స్టూడెంట్ కూడా..ఇలాంటి మంచి వ్యక్తిని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నాను.ఈ సినిమాతో తను గొప్ప దర్శకుడవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ  మా యూనిట్ లో పనిచేసే ప్రతి టెక్నీషియన్స్ కు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

లైన్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ సుంకర మాట్లాడుతూ.. నేను గత12 సంవత్సరాలుగా మా కంపెనీ యూ మీడియా నుండి చాలా ఈవెంట్స్ తో అసోసియేట్ అవుతూ చాలా మంది ఆర్టిస్టుల డేట్స్ చూసే వాన్ని. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో లో  ప్రొడక్షన్ హౌస్ లో వర్క్ చేయాలనే కోరిక ఉండేది.మంచి టీం మంచి అవకాశం కోసం ఎదురు చూశాను.రాజ్ కృష్ణ మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన ఎప్పటి నుండి సినిమాలకు కథలు రాసేవారు.తేజ గారికి అసోసియేట్ గా వుంటూ చాలా సినిమాలకు వర్క్ చేశాడు.సతీష్ గారు కూడా చాలా పరిచయం ఆయన ఫస్ట్ ప్రొడక్షన్స్ కంప్లీట్ చేసి సెకెండ్ ప్రొడక్షన్ లోకి ఎంటర్ అయ్యాడు.ఈ సినిమాకు నేను సతీష్ గారితో అసోసియేట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది.మా కంపెనీ యూ మీడియా నుండి కాస్టింగ్ నుండి ప్రొడక్షన్ వరకు ఈ సినిమాకు అన్ని బాధ్యతలు తీసుకొని సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ సతీష్ గారికి సపోర్టు చేస్తాము.తొందర్లోనే ఈ సినిమాను స్టార్ట్ చేసి తొందరలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తామని అన్నారు.

దర్శకుడు రాజ్ కృష్ణ మాట్లాడుతూ …. నిర్మాత నా  కథ విన్న వెంటనే నాకు అవకాశం ఇచ్చారు అందుకు ఆయనకు ధన్యవాదాలు.మే నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి మే లో నెల చివరికంతా సినిమా  షూటింగ్ ని పూర్తి చేస్తాము .ఇది పూర్తి రామ్ కామ్ ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం .అన్ని వర్గాల వారిని ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని అన్నారు 

సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ మాట్లాడుతూ ..మా గురువు గారు బాలు గారిని గుర్తు చెసుకుంటూ ఆయన కోరిక ఇది ఎప్పుడు కలిసినా మళ్ళీ ఎప్పుడు మ్యూజిక్ స్టార్ట్ చేస్తావ్ ఆనేవాడు.నేను ఆప్పుడు అంత సీరియస్ తీసుకోలేదు. ఇప్పుడు ఆయన మాటలే గుర్తుకు వస్తాయి.ఇప్పుడు కూడా సరైన డెసీజన్ తీసుకోకపో తే కరెక్టు కాదను కొని మళ్ళి కంబ్యాక్ అయ్యాను.నా మిత్రుడు సతీష్ ఫస్ట్ ప్రొడక్షన్ లో మంచి సినిమా  తీసి మంచి విజయం అందుకున్నాడు. ఇప్పుడు తన సెకెండ్ మూవీ లో నన్ను సెలెక్ట్ చేసుకోవడం ఆనందంగా ఉంది.ఈ చిత్రం అందరికీ మంచి పేరు తీసుకురావాలని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు   పాల్గొని ఈ చిత్రం పెద్ద విజయం సాదించాలని అన్నారు

0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Ishq Pre Release Event Photos

  • 2

    Neha Shetty Latest Photos

  • 3

    బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన ముమైత్ ఖాన్

  • 4

    Sai Pallavi Latest Photos

  • 5

    Meenakshi Chaudhary Latest Photos

  • 6

    Charan donates 70 lakhs to fight Corona Virus

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews