ధనుష్, మలయాళ బ్యూటీ సాయి పల్లవి జంటగా.. బాలాజీ మోహన్ డైరెక్షన్‌లో ‘మారి’ కి సీక్వెల్‌గా వచ్చిన చిత్రం ‘మారి 2’. ఈ మూవీలో ‘రౌడీ బేబీ’ పాట గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ సాంగ్ ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సాంగ్ సౌత్ ఇండియాలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
ఈ పాట సౌత్ ఇండియాలోనే అగ్రస్థానంలో నిలిచింది. 1 బిలియన్ ప్లస్ వ్యూస్‌తో సౌత్‌లో ఇప్పటి వరకు ఏ పాట సాధించని రికార్డుని రౌడీ బేబీ సాంగ్ అందుకున్నట్లుగా స్వయంగా హీరో ధనుష్ తెలపడం విశేషం. అంతేకాదు ఒకప్పుడు ప్రపంచాన్ని షేక్ చేసిన పాట ‘కొలవెరి ఢీ’ 9వ యానివర్సరీ రోజే.. ఈ పాట వన్ బిలియన్ వ్యూస్ సాధించడం ఎంతో సంతోషంగా ఉందంటూ ధనుష్ ట్వీట్ చేశారు.
యువన్ శంకర్ రాజా మ్యూజిక్, క్యాచీ లిరిక్స్‌తో పాటు, ధనుష్, ధీ వాయిస్‌తో ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభు దేవా కంపోజ్ చేసిన స్టెప్స్ ఈ పాటను వేరే లెవల్‌కి తీసుకెళ్లాయి. ఇక సాయి పల్లవి స్టెప్స్ అయితే ఇరగ దీసేసింది. హీరోయిన్ కాకముందు పలు డ్యాన్స్ షోలలో పార్టిసిపేట్ చేసిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఈ సాంగ్‌లో ధనుష్‌తో కలిసి దుమ్ము దులిపేసింది. కొన్ని కొన్ని చోట్ల ధనుష్‌ని కూడా డామినేట్ చేసేసింది. అందుకే ఈ సాంగ్ ఎప్పటికి రికార్డ్స్ బ్రేక్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. https://www.youtube.com/embed/x6Q7c9RyMzk