మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య షూటింగ్ కరోనా కారణంగా నిలిచి పోయిన విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని మొదట రామ్ చరణ్ నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. కాని కొరటాల శివ విజ్ఞప్తితో ఆయన స్నేహితుడు నిరంజన్ రెడ్డిని నిర్మాణ భాగస్వామిగా చేర్చుకోవడం జరిగింది.
రామ్ చరణ్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో పాటు సైరా మిగిల్చిన నష్టాల కారణంగా ఆచార్య సినిమాకు ఆయన పూర్తి స్థాయి నిర్మాతగా ఉండాలనుకోవడం లేదట. ఈ విషయంలో ఆయనే స్వయంగా దర్శకుడు కొరటాలతో మాట్లాడి సినిమాలో తన వాటాను కుదించుకున్నాడట.
ప్రస్తుతం ఆచార్య చిత్రంలో చరణ్ కు కేవలం 25 శాతం వాటా మాత్రమే ఉందని తెలుస్తోంది. ఇక చిరంజీవి పారితోషికం విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. చిరు పారితోషికం వాటాగా 25 శాతం ఇచ్చారా అనేది తెలియదు. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నాడు. కనుక ఆయన పారితోషికం ఎంత అనేది ఇంకా చర్చలు జరిగినట్లుగా లేవు. అయితే చిరు, చరణ్ ల పారితోషికాలతో ఈజీగా 50 శాతం వాటా తీసుకోవచ్చు కాని సైరా ఫలితం చరణ్ ను భయపెడుతుందని పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఆచార్య చిత్రంతో చిరంజీవి మరో బ్లాక్ బస్టర్ ను దక్కించుకోవడం ఖాయం అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కొరటాల చేసిన సినిమాలు అన్ని కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచినవే. ఇక చిరంజీవితో పాటు చరణ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్న కారణంగా అంచనాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. సైరా సినిమా మంచి వసూళ్లను రాబట్టినా కూడా బడ్జెట్ ఎక్కువ అవ్వడంతో నిరాశ పరిచింది.
ఇప్పుడు ఆచార్య మాత్రం ఖచ్చితంగా మంచి లాభాలను తెచ్చి పెడుతుందనే నమ్మకంతో నిరంజన్ రెడ్డి ఈ డేరింగ్ స్టెప్ వేస్తున్నాడు. కొరటాల శివకు ఆప్తుడు అయిన ఆచార్య నిర్మాత ముందు ముందు మరిన్ని సినిమాలు నిర్మించే అవకాశం ఉంది. మరో వైపు చరణ్ ఈ సినిమా సక్సెక్ అయితే మళ్లీ తండ్రితో సినిమాను సొంతంగానే నిర్మించే అవకాశం ఉందని అంటున్నారు.