సూపర్ స్టార్ రజనీకాంత్ అపోలో హాస్పటల్ లో చేరడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. పది రోజుల క్రితం రజనీకాంత్ తన కొత్త చిత్ర షూటింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చారు. కాగా చిత్ర యూనిట్ లో 8 మందికి కరోనా సోకడం తో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. రజిని సైతం కరోనా టెస్ట్ చేసుకోగా ఆయనకు నెగిటివ్ వచ్చింది.
ఈ క్రమంలో శుక్రవారం హైబీపీతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో రజనీకాంత్ చేరారు. రెండు రోజుల పాటు చికిత్స అవసరమని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనతో పాటు కుమార్తె ఐశ్వర్య ఆస్పత్రిలోనే ఉన్నారు. రజినీకి హైబీపీ మినహా ఇతర ఆరోగ్య సమస్యలేవి లేవని హాస్పిటల్ ప్రెస్ నోట్ విడుదల చేసింది.
కాగా రజినీకి కరోనా పాజిటివ్ అని తాజాగా తేలినట్లు కథనాలు వెలువడుతున్నాయి. కోవిడ్ లక్షణాలు కనిపించడంతోనే ఆయన హాస్పిటల్లో చేరారని ప్రచారం జరుగుతోంది. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.