![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2020/12/rajani-house.jpg?resize=800%2C623&ssl=1)
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి చేరుకున్నారు. ‘అన్నాత్తే` సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన శుక్రవారం ఉదయం అధిక రక్తపోటు తో జూబ్లీహిల్స్ హాస్పటల్ లో చేరిన సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు ఆయనకు వైద్యం చేసిన డాక్టర్స్ ఆదివారం డిశ్చార్జ్ చేసారు.
తన కుమార్తెతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుండి చెన్నైకి పయనమయ్యారు. రజినీ ఆరోగ్యం పట్ల ఆందోళన చెందిన అభిమానులు భారీగా ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. తలైవా.. తలైవా..
అంటూ ఆయనకు స్వాగతం పలికారు. రక్తపోటులో హెచ్చతగ్గుల వల్లే రజినీ అనారోగ్యానికి గురయ్యారని, ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకోవాలని ఎలాంటి సమావేశాలకు , షూటింగ్ లకు హాజరు కాకోదని , ఓ వారం పాటు పూర్తి విశ్రాంతి అవసరమని తెలిపారు.