రాజమౌళి కుటుంబ సభ్యులు దాదాపు అంతా కూడా కరోనాను జయించారు. తమకు కరోనా అంటూ రాజమౌళి ప్రకటించిన సమయంలోనే తాము ప్లాస్మాను దానం చేయబోతున్నట్లుగా కూడా ప్రకటించాడు. రాజమౌళి ఇటీవలే తాము అంతా కూడా కరోనాను జయించినట్లుగా ప్రకటించాడు. అతి త్వరలో మేము కరోనాకు దివ్య ఔషదంగా చెబుతున్న ప్లాస్మాను ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాం అన్నారు.
వైధ్యులు రెండు వారాలు ఆగిన తర్వాత ప్లాస్మాదానంకు ముందుకు రావాలంటూ సూచించారు అంటూ రాజమౌళి చాలా ఉత్సాహంగా ప్లాస్మాదానంకు సిద్దం అవుతున్నట్లుగా పేర్కొన్నాడు. రాజమౌళి నేడు చాలా నిరుత్సాహంగా తాను ప్లాస్మా ఇవ్వలేక పోతున్నాను అంటూ పేర్కొన్నాడు. వైధ్యుల సూచన మేరకు నేను ప్లాస్మా ఇవ్వడం లేదు. ఎందుకంటే నా శరీరంలో ఉండాల్సిన యాంటీ బాండీస్ కంటే తక్కువగా ఉన్నాయి.
నా ప్లాస్మా కరోనా రోగం నివారణకు పనికి రాదంటూ వైధ్యులు అన్నారు. అందుకే నేను ప్లాస్మా ఇవ్వాలని చాలా అనుకున్నా కూడా ఇవ్వలేక పోతున్నాను. అయితే పెద్దన్న కీరవాణి మరియు భైరవలు ప్లాస్మా ఇచ్చారు. వారి మాదిరిగానే మరికొందరు కూడా ప్లాస్మా దానంకు ముందుకు రావాలని శరీరంలో ఉన్న యాంటీ బాడీస్ ను ఇతరులకు ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలు కాపాడిన వారు అవుతారు.
మీ యాంటీ బాడీస్ తక్కువగా ఉంటే మీ నుండి తీసుకోరు.. కాని ఎవరి వద్ద అయితే యాంటీ బాడీస్ స్తాయి ఎక్కువగా ఉంటుందో వారి నుండి ప్లాస్మాను వైధ్యలు స్వీకరిస్తారని రాజమౌళి పేర్కొన్నాడు.