FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
FeaturedNewsPress Releaseతెలుగు న్యూస్

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శి ,నిర్మాత సీ.యన్.రావు సంతాప సభ

by Admin April 23, 2021

“మా సిరిమల్లే”, “అమ్మ నాన్న లేకుంటె”, “బ్రహ్మానందం డ్రామా కంపెనీ”, తమిళ్ లో “ఊరగా”  మొదలగు తెలుగు, తమిళంలో చిత్రాలను నిర్మించడంతో పాటు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేసిన నిర్మాత సి.యన్ రావు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శిగా సేవలందించారు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కోవిద్ వల్ల ఒక నిర్మాతని కోల్పోయింది. కరోనాతో కన్నుమూసిన నిర్మాత సీఎన్ రావు (చిట్టి నాగేశ్వరరావు) సంతాప సభ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగింది. సీఎన్ రావు సంతాప సభలో నిర్మాతల మండలి అధ్యక్షులు సి.కళ్యాణ్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ హానరబుల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ హానరబుల్ సెక్రెటరీ మోహన్ వడ్లపట్ల, సీనియర్ నిర్మాత చదవల వాడ శ్రీనివాస్ రావ్ , ప్రొడ్యూసర్ కౌన్సిల్ ట్రెజరర్ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్  ముత్యాల రామదాసు, మోహన్ గౌడ్,  ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ మద్దాల రాందాస్ , నిర్మాతల ల మండలి ఈ.సి మెంబెర్ ఆచంట గోపినాథ్, నిర్మాత బసిరెడ్డి, నిర్మాత పల్లి కేశవరావు, నిర్మాత విజయానంద్ , నిర్మాత విజయవర్మ,.  జి.యన్ కృష్ణ, యఫ్.డి.సి అనంత్, నిర్మాత తులసీరామ్, మధు తదితర చిత్ర నిర్మాతలు పాల్గొని  ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం

 *నిర్మాతల మండలి అధ్యక్షులు సి.కళ్యాణ్ మాట్లాడుతూ….* సి.యన్ రావు నాకు మంచి అనుబందం ఉంది. స్ట్రెయిట్ గాముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. ఈ ఆర్గనైజషన్ మంచి కోరుకునే మంచి వ్యక్తి కోల్పయినందుకు చాలా బాధ గా వుంది.వాళ్ళ ఫ్యామిలీ కి నా సానుభూతి తెలియచేస్తున్నాను సి.యన్ రావ్ గారు ఎప్పుడూ  ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ని ముందుకు తీసుకెళ్ళమనే చెప్పే వాడు.మూడు రోజుల క్రితం  సి.యన్ రావ్ గారి తో మన ఆర్గనైజషన్ లో ఫస్ట్ ప్రయారిటీ హెల్త్ కి ఇద్దాం అని చెప్పడం జరిగింది. సీఎన్ రావు మనందరికీ చెప్పింది ఒకటే మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి అని ఇప్పుడు మనం చేయాల్సిన కర్తవ్యం వాళ్ళ ఫ్యామిలీకి మనం అండగా నిలబడడం. ఎవరికి ఎం జరిగినా మా దృష్టికి తీసుకు వస్తే మన ఆర్గనైజేషన్ నుండి వారికి సహాయ సహకారాలు అందుతాయి. మంచి వ్యక్తి సి.యన్ రావుని కోల్పవటం చాలా బాదాకరం వాళ్ళ కుటుంబానికి మనమంతా అండగా ఉంటామని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరు కుంటున్నానని అన్నారు. .

 *ప్రొడ్యూసర్ కౌన్సిల్  హానరబుల్ సెక్రెటరీ  మోహన్ వడ్లపట్ల, మాట్లాడుతూ..* నేను ఆఫీసులో ఉన్న స్టాఫ్ అందరికీ కొన్ని వందల సార్లు మాస్క్ పెట్టుకోమని చెప్పాను. అలానే ఆఫీస్ మెంబర్  ప్రసాద్ అన్నకి నాకైతే రోజు అని గొడవ జరిగేది. సో మీరు జాగ్రత్త .ఎవరైనా మాస్క్ పెట్టుకోకపోతే 100 రూపీస్ ఫైన్ వేస్తానని చెప్పడం జరిగింది. అందరూ సింగల్ మాస్క్ వేసుకొంటే నేను మాత్రం డబుల్ మాస్క్ వేసుకుంటున్నాను.ఎందుకంటే నాకు మెడికల్ పైన ఆవగాహన ఉంది.ఎందుకంటే  20 నుంచి 25 మంది నా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ మెడికల్ డాక్టర్స్. నా ఫ్యామిలీ లో నా సొంత  కొడుకు, కూతురు కూడా యు.యస్ లో మెడికల్ డాక్టర్స్ .నేను ఒకరోజు సి.యన్ రావు ముఖం చూశాను . ఫేస్ లో తేడా అనిపించి వెంటనే హాస్పిటల్ కు వెళ్ళమని చెప్పాను. నేను చెప్పబోయేది ఏమిటంటే ఆరోజు ఒకవేళ నేను చెప్పింది విని డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకుని ఉంటే ఒక మంచి వ్యక్తిని కోల్పోయే వాళ్ళం కాదు.అందరి బాగోగులను చూసుకొనే  సీయన్ రావు .లాంటి వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా భదాకరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి ప్రగాఢ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అని అన్నారు.

 *సీనియర్ నిర్మాత చదవల వాడ శ్రీనివాస్ రావు గారు మాట్లాడుతూ…* ప్రసన్న గారు సి.యన్ రావు గార్లు కలిసి మెలిసి ఉండేవారు ఆయన చనిపోవడానికి పరోక్షంగా మనం కూడా కారణం. స్వీయ నియంత్రణ పాటించక పోవటమో దీనికి కారణం,ప్రాణ నష్టం జరగాకుండా ఆపే శక్తీ మనకే వుంది, ఆయన్ని కాపాడలేక పోయినా తన ఫ్యామిలీని కాపాడు కుందామని అన్నారు.    

 *ప్రొడ్యూసర్ కౌన్సిల్ హానరబుల్ సెక్రెటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ …* నాకు మంచి మిత్రుడు, ఆప్తుడు ,తమ్ముడు లాంటివాడు తను మంచిని మంచిగా చెబుతూ..చెడు ఉంటే ఇది కరెక్ట్ కాదని చెబుతూ..చాలా క్లియర్ గా ఉండేవాడు. అలాంటి మనిషి చాంబర్ లో గాని కౌన్సిల్ లో గాని తమ్ముడు గా మంచి పేరు సంపాదించుకున్న  ఒకే ఒక్కడు సీయన్ రావు.చిన్న నిర్మాతల కోసం పోరాడుతూ చాంబర్లో ఎంతో మంది చిన్న నిర్మాతలకు న్యాయం చేస్తూ నిక్కచ్చిగా, నిష్కల్మషంగా ఉంటూ ఎంతటి వాడినైనా తప్పు చేసి ఉంటే అది తప్పు అని చెప్పే ఒక మంచి వ్యక్తి సియన్ రావు.రెవిన్యూ వర్షన్ లోగాని,  లీగల్ వర్షన్ లోగాని , నాలెడ్జ్ వెర్షన్ లో గానీ జ్ఞానసంపద కలిగిన మంచి మేధాసంపత్తి ఉన్న వ్యక్తి సీయన్ రావు.

ఆదిశంకరాచార్య చిన్నప్పుడే ఆరు సంవత్సరాల వయస్సులో జ్ఞాన సంపదను నేర్చుకొని పదహారు సంవత్సరాల వయసులో అఖండ భారతాన్ని చదివి 37 సంవత్సరాల వయసులో శివైత్యం పొందడం జరిగింది అలాంటి మహానుభాని లాగ ఇవాళ సీయన్ రావు స్వర్గలోకంలో ఆయన మేధా శక్తి అవసరమని దేవుడు తీసికెళ్లినట్లు భావించాలి. కౌన్సిల్ కోసం తను అద్భుతమైన ప్రాపర్టీ కొన్నాడు కౌన్సిల్ మెంబర్లందరికీ ఈ ప్రాపర్టీ ద్వారా మేలు జరగాలని కోరుకున్నాడు.. చిన్న సినిమాల నిర్మాతల కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి తను, అలాంటి వ్యక్తి కోసం నేను కౌన్సిల్ ఈసి లోను  మరియు జనరల్ బాడీ తోను మాట్లాడి ఆయన ఫోటోను గాని ఆయన పేరును ఛాంబర్ ఒక బిల్డింగ్ కి  పెట్టడమా అనే విషయం కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తాను.తల్లి తండ్రులు చనిపోయినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్న నేను సీఎన్ రావు చనిపోయాడు అని తెలిసిన వెంటనే షాక్ కు గురయ్యాను.

నాకు ఎంతో ఆప్తుడు, మంచి చెడు ప్రతిదానిలోనూ సలహాలిచ్చే ఒక మంచి వ్యక్తి తను లేకపోవడం నాకు తీరని లోటుగా భావిస్తున్నాను. తను  మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం.  మన మధ్య తను భౌతికంగా లేకపోయినా మన అందరి కోసం తను మన తోనే జీవిస్తున్నాడు. ఆయన ఆశయ సాధనకు మనందరం పాటుపడుతూ ఆయన పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ .వాళ్ళ ఫ్యామిలీ కి నా సానుభూతి తెలియచేస్తున్నాను అన్నారు.

 *ప్రొడ్యూసర్ కౌన్సిల్ ట్రెజరర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.* చిన్న సినిమాల నిర్మాతల కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి సి.యన్ రావు, తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలనే తపన పడే మంచి వ్యక్తిని కోల్పవటం చాలా బాధ కరం ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ  వాళ్ళకుటుంబానికి మేమంతా అండగా ఉంటామని తెలియజేస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ  సానుభూతి తెలియచేస్తున్నాను అని అన్నారు..

 *ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రామదాసు, మాట్లాడుతూ.* .ఆయనకి కోవిడ్ వచ్చిన విషయం  తెలిసి చాలా బాధ పడ్డాను. సి.యన్ రావు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అయన డ్రీం డిజిటల్ ని ముందుకు తీసుకు వెళ్లాలనేదే. ఆయన డ్రీమ్ ను మనందరం నిజం చేస్తే అయన ఆత్మకు శాంతి చేకూరుతుంది. వాళ్ళ ఫ్యామిలీ కి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని అన్నారు.

 *మోహన్ గౌడ్ మాట్లాడుతూ…* సీ.యన్ రావు ఇండస్ట్రీ బాగోగుల పట్ల స్పందిస్తూ చిన్న నిర్మాతల సమస్యల పట్ల స్పందించే ప్రధానమైనటువంటి వ్యక్తి సీయన్ రావు.అందరి చేత తలలో నాలుకలా వుంటూ అందరినీ అన్నయ్య అన్నయ్య అంటూ పలకరిస్తూ అందరి బాగోగులను చూసుకొనే వ్యక్తి సీఎన్ రావు .అలాంటి వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది.అతను లేని లోటుచిత్ర పరిశ్రమకు తీరని లోటు అది అందరికి తెలిసిన టువంటి విషయమే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి ప్రగాఢ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అని అన్నారు.

 *నిర్మాత బసిరెడ్డి గారు మాట్లాడుతూ ..* సి.యన్.రావ్ గారు ఛాంబర్ లో ఎన్నో విషయాలలో అండదండలు అందించే వారు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి సినిమాకి సేవలు అందించిన గొప్ప వ్యక్తి,. చదలవడగారు చెప్పినట్టు అందరం  సామజిక దూరం పాటించి మన ఆరోగ్యం తో పాటు అందరి ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత మానందరిపై ఉంది.కరోనా మహమ్మారి ఒక మంచి వ్యక్తిని బలి తీసుకుంది  మనమంతా అయన ఆత్మకు శాంతి చేకూరాలి అని కోరుకుంటున్నానని అన్నారు.

 *నిర్మాత పల్లి కేశవరావు గారు మాట్లాడుతూ..* సి.యన్ రావు ఇండస్ట్రీకి రావటానికి నేను ఒక కారణం. చాలా సామాన్యంగా వుండే వాడు “బ్రహ్మ్మనందం డ్రామా కంపెనీ” సినిమా విషయంలో చాలాసహకరించాడు, తనకు నేనంటే చాలా ఇష్టం అయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటు న్నానని అన్నారు.

 *నిర్మాత విజయానంద్ గారు మాట్లాడుతూ..* సి.యన్ రావు , నాగార్జునరెడ్డి , నేను బాగా క్లోజ్ గావుండే వాళ్ళం సి.యన్ రావు కోరుకున్న డిజిటల్ ప్రొవైడర్స్ ని ముందుకి తీసికెల్తే అయనాత్మకు శాంతి చేకూరుతుంది అని అన్నారు.
 *విజయవర్మ మాట్లాడుతూ* .. తనతో నాకు చాలా అనుబంధం ఉంది.నేను తిరుపతి లో ఉండగా ఈ వార్తవిని షాక్ తిన్నాను.వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అన్నారు.

 *నిర్మాతల మండలి ఈసి మెంబెర్ ఆచంట గోపినాథ్ మాట్లాడుతూ..* ఒక మంచి మిత్రిడుని కోల్పవటం చాలా బాధ కారం వాళ్ళ కుటుంబాని కి నా సానుభూతి తెలియచేస్తున్నాను, 

 *నిర్మాత జి యన్ కృష్ణ గారు మాట్లాడుతూ..* సి యన్ రావు అని నిత్యం సినిమా గురించే ఆలోచించే వాడు అయన మరణం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం. వాళ్ళ కుటుంబానికి నా సానుభూతి తెలియచేస్తున్నాను. 
 *యఫ్.డి.సి. అనంత్ గారు మాట్లాడుతూ..* సి యన్ రావ్ గారు నాకు ఒక అన్నలా, తమ్ముడు లాగా వుంటూ  సెన్సార్ లో కొత్త ఒరవడి తెచ్చిన వ్యక్తి సి.యన్ రావ్ తను మన మధ్య లేదనేది జీర్ణించుకోలేక పోతున్నానని అన్నారు 

 *మధు  మాట్లాడుతూ..* సి.యన్ రావు గారితో నాకు 15సంవత్సరాలు అనుబంధం ఉంది. ఏది జరిగిన నాకు చెప్పే వాడు అలాంటి మంచి ఆప్త మిత్రుడిని కోల్పోయిననందుకు చాలా బాధగా ఉంది.తన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు.
 *నిర్మాత తులసీరామ్ గారు మాట్లాడుతూ..* సి.యన్ రావు గారు తక్కువ పరిచయంలో నాకు దగ్గరయిన మంచి వ్యక్తి తను. ఆయన ఆత్మ కు శాంతి చేకూరాలని తెలియజేస్తూ తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాతలందరూ సి.యన్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a Reply Cancel reply

లూయిస్ పార్క్ యాడ్ షూటింగ్ లో బిగ్ బాస్ యాంకర్...

Telugu Film Working Photo Journalists Association greets Anil...

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Rashmika Photos at Pushpa Pre-Release Party

  • 2

    Rashmika Latest Photos from Pushpa Interview

  • 3

    Rashmika Latest Photos at Pushpa Press Meet

  • 4

    Sai Pallavi Latest Photos

  • 5

    Anchor Syamala Latest Photos

  • 6

    Nidhhi Agerwal Latest Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews