అందరికీ ఈ సినిమాకు జీవం పోసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు
1957 మార్చి 27న ఈ సినిమా విడుదలైంది నెల రోజుల తేడాలో ఇదే సంవత్సరంలో తమిళంలో రిలీజ్ చేశారు తర్వాత ఈ సినిమాను పూర్తి ఈస్ట్ మన్ కలర్ తో రూపొందించారు నాగిరెడ్డి-చక్రపాణి నిర్మించిన ఈ చిత్రానికి కె.వి.రెడ్డి దర్శకత్వం వహించారు ఈ చిత్రానికి ప్రాణం పోసింది ఘటోద్గజుడు పాత్రలో ఎస్.వి.రంగారావు జీవం పోసింది మహానటి సావిత్రి అనుటలో అతిశయోక్తి లేదు
మహానటుడు ఎన్టీ రామారావు
అక్కినేని నాగేశ్వరరావు
పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య గుమ్మడి వెంకటేశ్వరరావు ఎందరో ఉద్దండులు ప్రాణం జీవం సర్వం అర్పించిన చిత్రం
మాయాబజార్
ఈ చిత్రం ఎన్నో నూతన వరవడిలకు , ఆలోచనలకు జీవం పోసింది .
ప్రతి వ్యక్తికి నచ్చిన పది చిత్రాల్లో ఈ సినిమా ఒకటి
ఘంటసాల వెంకటేశ్వరరావు సాలూరు రాజేశ్వరరావు సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు అజరామరం
ఈ సినిమా కథా రచయిత మొత్తం పాటల రచయిత పింగళి నాగేంద్రరావు.
వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాలవారి విందు నాకే ముందు ఈ పాటకి తగ్గట్టుగా ఎస్.వి.రంగారావు అభినయం ఆనాడే అబ్బురపరిచిన సాంకేతిక కెమెరా నిపుణత …..
జయహో మాయాబజార్ అనాల్సిందే .
181 నిమిషాలు నిడివిగల ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరు తెలుగు చిత్రానికి జేజేలు…జయహో పలుకక తప్పదు.
1957 లోనే 33 లక్షలు రూపాయలు ఈ చిత్రానికి వ్యయం అయితే నేటి ధరతో పోలిస్తే వంద కోట్ల పైనే పెట్టుబడి పెట్టారు
ఈ చిత్రం రిలీజ్ అయిన వెంటనే కేవలం మూడు నెలల్లో ఐదు రెట్లు పైగా లాభాన్ని ఇచ్చింది నేటితో పోలిస్తే కోట్లాది రూపాయల కలెక్షన్లు ఇంకా వసూలు చేస్తూనే ఉంది కావ్యేషు నాటకం రమ్యం అన్నట్లు ఈ సినిమాని చూస్తే కళ్ళముందు సురభి నాటకం సంస్థవారు నటిస్తున్నారా అన్నట్లు మైమరిపించింది.
సురభి నాటక సంస్థ కూడా మాయాబజార్ సినిమా నాటక రూపంలో వేలాది ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చింది.
“” మడిసన్నాక కాసింత కళాపోషణ ఉండాలి అని ముళ్లపూడి అన్నట్లు ఈ సినిమా చూస్తే మానవ జీవన విధానం పై ఒక నూతన అనుభూతి కలిగించక తప్పదు ఎన్నో ఆలోచనలు ఎన్నో ప్రయోగాలు దర్శకుడు కె.వి.రెడ్డి ఈ సినిమాతో ప్రవేశపెట్టారు.
పాతాళభైరవి, జగదేకవీరుని కథ ,గుండమ్మ కథ, మిస్సమ్మ, షావుకారు జానకి, తదితర అద్భుతమైన చిత్రాలను అందించిన విజయ సంస్థ రూపొందించిన ఈ మాయాబజార్ చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలోనే విజయాల బావుటాను ఎగురవేసింది
2010 జనవరి 30న ఈ మాయాబజార్ చిత్రాన్ని పూర్తి ఈస్ట్ మాన్ కలర్ లో రూపొందించి రిలీజ్ చేశారు.