మెగా బ్రదర్ నాగబాబు కూతురు వివాహం ఖాయం అయిన విషయం తెల్సిందే. గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు, పద్మల తనయుడు అయిన చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం ఖరారు అయ్యింది. ఇప్పటికే వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. గతంలో ప్రచారం జరిగినట్లుగా వీరిద్దరి వివాహ నిశ్చితార్థంకు ఆగస్టు వేదిక అవ్వబోతుంది. సినీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆగస్టు 13వ తారీకున వివాహ నిశ్చితార్థంకు డేట్ ఖరారు చేయడం జరిగిందట.
ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించలేదు. కాని మెగా సన్నిహితుల నుండి అందుతున్న ఈ సమాచారం నిజమైనదిగా ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. నిహారిక పెళ్లి తర్వాత కూడా నటించేందుకు చైతన్య ఒప్పుకున్నాడని, ఇద్దరి మద్య మంచి సన్నిహిత్యం ఏర్పడిన కారణంగానే కుటుంబ సభ్యులు పెళ్లికి రెడీ అయ్యారు అంటూ టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం వీరిద్దరు ఈ లాక్డౌన్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారట.
ఇక వరుణ్ తన బాక్సర్ చిత్రం షూటింగ్‌ను ఆగస్టులో పున: ప్రారంభించాల్సి ఉన్నా కూడా నిహారిక నిశ్చితార్థం కారణంగా సెప్టెంబర్‌లో షూటింగ్‌కు వెళ్లబోతున్నాడు. నిహారిక చైతన్యల వివాహ నిశ్చితార్థంలో మెగా హీరోలు అంతా కూడా పాల్గొనే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటాడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆయన చతుర్మాస ధీక్ష చేస్తున్నాడు. అయినా కూడా కూతురు నిశ్చితార్థంకు రాకుండా ఉండడు.