యువ హీరో నాగ శౌర్య..హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ , నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ లో తన 20 చిత్రంలో నటిస్తున్నాడు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ప్రాచీన క్రీడా నేపథ్యంలో తెరకెక్కబోతోన్నట్టు తెలుస్తోంది. కండలు తిరిగిన దేహం తో శౌర్య ఈ మూవీ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ రెడ్డి కెమెరామెన్‌గా పని చేస్తున్నాడు. కాల భైరవ సంగీతాన్ని అందిస్తుండగా.. జునైడ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడు.
ఇక ఈ సినిమాకు టైటిల్ ఏంటి అన్న దానిపై గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. విలువిద్య నేపథ్యంలో తయారవుతున్న ఈ సినిమాకు పార్ధు అనే టైటిల్ కావాలని అనుకున్నారు. అసలు అంతకు ముందు ధనుర్దారి అనుకున్నారు. కానీ అది వేరే వాళ్ల దగ్గర వుండడంతో కుదరలేదు. పార్ధు టైటిల్ ను త్రివిక్రమ్ కోసం రిజిస్టర్ చేసి వుంచారు. అందువల్ల అది కుదరలేదు. ఆఖరికి లక్ష్యం అనే టైటిల్ అనుకున్నారు. కానీ కొన్నేళ్ల క్రితమే ఈ టైటిల్ తో గోపీచంద్ సినిమా చేయడంతో దాన్ని కూడా పక్కన పెట్టారు. ఆఖరికి లక్ష్య అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సుబ్రహ్మణ్యపురం సినిమా తరవాత దర్శకుడు సంతోష్ చేస్తున్న సినిమా కావడం తో దీనిపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.