ప్రముఖ గాయని మంగ్లీ పాడిన ‘యోగితత్వం’ పాటను ‘మెగాస్టార్’ చిరంజీవి విడుదల చేశారు. ‘యోగితత్వం’ గీతాన్ని విడుదల చేసిన అనంతరం చిరంజీవి సాంగ్ యూనిట్ కు బెస్ట్ విశెస్ తెలిపారు. దాము రెడ్డి ఈ పాటకు దర్శకత్వం వహించారు. బాజి సంగీతాన్ని సమకూర్చగా..ఈ పాట మల్కిదాసు తత్వసంకీర్తన నుంచి సేకరించినది. అచలయోగి, సంకీర్తనాచార్యులు, తత్వవేత్త, రచయిత, హరికథ గాన సంపన్నుడైన మల్కిదాస్… ‘నా గురుడు నన్నింకా యోగి గమ్మననె, యోగి గమ్మననె, రాజయోగి గమ్మననె…..’ అంటూ సాగే ఈ పాటలో యోగితత్వాన్ని అద్భుతంగా వివరించారు.
మంగ్లీ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ లో ‘యోగితత్వం’ పాట అప్ లోడ్ అయ్యింది. మంగ్లీ పాటలను ఇష్టపడేవారు ఈ పాటకు హయ్యెస్ట్ వ్యూస్ ఇవ్వనున్నారు. శివాణి మాటూరి సమర్పణలో రూపొందిన ఈ పాటకు సినిమాటోగ్రఫీ – తిరుపతి, ఎడిటర్ – ఉదయ్ కంభం.