నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో కేవీ అనుదీప్ డైరెక్షన్లో రూపొందిన చిత్రం ‘జాతిరత్నాలు’. స్వప్న సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మించారు. ఈ నెల 11న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా.. సినిమాటోగ్రఫర్ మనోహార్, ఎడిటర్ అభినవ్ మీడియాతో మాట్లాడారు.
సినిమాటోగ్రఫర్ మనోహార్ మాట్లాడుతూ–‘‘మాది నెల్లూరు. నా పేరు మనోహార్. స్క్రీన్ పై సిద్ధం మనోహార్ అని ఉంటుంది. నాగి అన్న కార్పొరేట్ వీడియోస్, వెడ్డింగ్ వీడియోస్‌ను డైరెక్ట్ చేసే ప్రాసెస్‌లో ఉన్న సమయంలో అప్పుడు మేం చాలా వర్క్ నేర్చుకున్నాం. ఆ టైమ్‌లో ఎవడే సుబ్రహ్మాణ్యం సినిమా స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత డైరెక్షన్ ట్రయల్స్ చేశాను. ఆ టైమ్‌లో నాగి అన్న, స్వప్న అక్క డైరెక్షన్లోకి వెళితే సినిమాటోగ్రఫీ చేయలేవు అని చెప్పి నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మహానటి సినిమాకు అసిస్టెంట్‌గా చేశాను. అమ్మదివెన పాటు ఓ చిన్న సినిమాకు పని చేశాను. ఆ నెక్ట్స్ జాతిరత్నాలు సినిమాకు సినిమాటోగ్రఫర్ గా చేశాను.
ఈ సినిమా పెద్ద హిట్‌గా నిలిచింది. ఆడియన్స్ సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది. వైజయంతీ వారితో నాది తొమ్మిది సంవత్సరాల జర్నీ. ఈ సినిమాకు కొన్ని రీ షూట్స్ కూడా చేశాం. ఎవడే సుబ్రహ్మాణ్యం, మహానటి సినిమాల కన్నా ఈ సినిమాకు నాగి అన్న ఎక్కువ కష్టపడ్డారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. సమర్గారి వల్ల ఫిల్మ్ మేకింగ్‌పై నాకు మరింత ఇంట్రెస్ట్ కలిగింది. కోర్టు సీన్స్‌ను నాగ్‌అశ్విన్‌గారు, దత్‌గారు దగ్గర ఉండి పర్వవేక్షించారు. నాగ్‌గారు ఎప్పుడు లొకేషన్లోనే ఉండేవారు.లాక్డౌన్లో కమిటైన ప్రాజెక్ట్స్ రెండు ఉన్నాయి. కెమెరామన్స్లో నాకు పీసీశ్రీరామ్గారు ఇష్టం.
ఆయన స్టోరీస్ చదివి ఇన్స్పైర్ అయ్యాను.
ఎడిటర్ అభినవ్ మాట్లాడుతూ – ‘‘ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. వెడ్డింగ్ ఫిల్మ్స్, కమర్షియల్స్ వంటివి సరదాగా షూట్ చేసి ఎడిట్ చేసేవాడిని. నాకు ఉన్న సిల్క్స్లో ఎడిటింగ్‌పై మంచి గ్రిప్పు ఉంది. ఏడాదిన్నర క్రితం ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’ అనే వెబ్‌సిరీస్‌ను ఎడిట్ చేసే చాన్స్ వచ్చింది. ఎడిటర్‌గా నాకు పెద్ద బిగ్ ప్రాజెక్ట్ అది. నెక్ట్స్ జాతిరత్నాలకు ఎడిటర్‌గా చేశాను. నాకు డైరక్టర్ కావాలని ఉంది. డైరెక్షన్ అంటే సినిమాటోగ్రఫీ, రైటింగ్ ఇలా అన్ని క్రాప్ట్స్‌పై పట్టు ఉండాలి.
నేను సినిమాను డైరెక్ట్ చేసిన ఎడిటింగ్ నేనే చేయాలనుకుంటాను. సో…ఎడిటింగ్‌పై మరింత దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను. ఈ సినిమాలో జోక్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమా టైప్ ఆఫ్ కామెడీని ఎడిట్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. వెబ్‌సిరీస్ ఎడిటింగ్ ఫార్మాట్ వేరు. సినిమా ఎడిటింగ్ వేరు. వెబ్‌సిరీస్‌కు ఒవరాల్ థీమ్‌తో పాటు ప్రతి ఎపిసోడ్ టైమ్ చూసుకోవాలి. సినిమాకు అలా ఉండదు. కథ ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది. ఎడిటింగ్ స్కిల్ పెంచుకుంటే ఏ డైరెక్టర్‌తో అయిన పని చేసే అవకాశం వస్తుందని నా నమ్మకం. ఎడిటర్స్ డైరెక్టర్స్ అయినవారు కూడ ఉన్నారు. రాజుహిరాణి, ఆంథోనీ, రాజమౌళిగారుకి ఎడిటింగ్‌లో మంచి స్కిల్ ఉంది. కథను ఎలా చెప్పాలి, క్యారెక్టర్స్‌ను ఎలా చూపించాలి అనేవి ఎడిటింగ్ ద్వారానే మరింత తెలుస్తాయి.