ఈటీవీలో గత ఎనిమిది సంవత్సరాలుగా జబర్దస్త్ కార్యక్రమం ప్రసారం అవుతున్న విషయం తెల్సిందే. మొదట వారంలో కేవలం ఒక్కరోజు మాత్రమే జబర్దస్త్ వచ్చేది. కాని సూపర్ హిట్ అవ్వడంతో వారంలో రెండు రోజులు అంటే గురు శుక్రవారంల్లో జబర్దస్త్ మరియు ఎక్స్‌ట్రా జబర్దస్త్ అంటూ రెండు షోలను ప్రసారం చేస్తున్నారు. అనసూయ మరియు రష్మిలు ఈ షోకు యాంకర్స్‌గా వ్యవహరిస్తున్నారు. నాగబాబు రోజు సుదీర్ఘ కాలం పాటు జడ్జ్‌లుగా వ్యవహరించారు. కొన్నాళ్ల క్రితం నాగబాబు జడ్జ్‌గా తప్పుకున్నాడు. ఆయన ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారం అవుతున్న అదిరింది షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ విషయం పక్కన పెడితే జబర్దస్త్ షో నుండి నాగబాబు వెళ్లిన సమయంలో కుదుపు తప్పదనుకున్నారు. కాని ఏమాత్రం మార్పు లేకుండా జబర్దస్త్ రేంటింగ్స్ వచ్చాయి.
నాగబాబు పోయినా కూడా అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో కరోనా కారణంగా జబర్దస్త్ షోకు బ్రేక్ పడినది. కేవలం జబర్దస్త్ మాత్రమే కాదు అన్ని షోలకు సీరియల్స్ కు కూడా బ్రేక్ పడ్డట్లయ్యింది. దాదాపుగా మూడు నెలల పాటు జబర్దస్త్ కొత్త ఎపిసోడ్స్ లేవు. పాత స్కిట్స్‌ను మళ్లీ మళ్లీ వేశారు. గత నెలలో మళ్లీ షూటింగ్స్‌కు అనుతులు ఇచ్చారు. లాక్ డౌన్ సడలించడంతో జబర్దస్త్ షూటింగ్స్ జరుగుతున్నాయి. ఈ నెల ఆరంభం నుండి షో మళ్లీ ప్రారంభం అయ్యింది. అయితే గడచిన నాలుగు వారాలుగా షోకు ఏమాత్రం రేటింగ్ రాకపోవడంను గమనించవచ్చు. గతంలో షోకు అద్బుతమైన రెస్పాన్స్ ఉండేది. ఎప్పుడు కూడా రేటింగ్ టాప్‌లో ఉండేది. కాని ఈటీవీ న్యూస్ స్థాయిలో కూడా రేటింగ్ రావడం లేదట.
హైపర్ ఆది మరియు సుడిగాలి సుదీర్ స్కిట్స్ తప్ప మరెవ్వరి స్కిట్స్ కూడా ఆకట్టుకోక పోవడం ఒక్క రీజన్ అయితే మరో కారణం ఓటీటీకి ప్రేక్షకులు అలవాటు పడి అటుగా వెళ్లారు. ఇప్పుడు ప్రేక్షకులు ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆసక్తిగా చూడటం లేదు. గతంలో యూట్యూబ్‌లో జబర్దస్త్ స్కిట్స్‌కు విపరీతమైన వ్యూస్ వచ్చేవి. వారం మొత్తం ట్రెండ్డింగ్‌లోనే ఆ వీడియోలు ఉండేవి. కాని ఇప్పుడు మాత్రం యూట్యూబ్‌లో పెద్దగా వ్యూస్‌ను రాబట్టడం లేదు. ట్రెండ్ లో కూడా ఉండటం లేదు. యూట్యూబ్ ద్వారా కూడా మంచి ఆదాయం వచ్చేదని కాని ఇప్పుడు అది కూడా పోయింది అంటూ టాక్ వినిపిస్తుంది. మొత్తానికి ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ జైత్ర యాత్రకు ఫుల్ స్టాప్ పడే రోజు దగ్గర్లో ఉందా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదే రేటింగ్ కొనసాగితే షోను నిలిపేస్తారనే టాక్ నడుస్తోంది.