ఇటీవల కాలంలో యూత్ ను బాగా ఆకట్టుకున్న, విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సినిమా డీజే టిల్లు. డెలాగులు, పాటలు, ప్రచార చిత్రాలతో సినిమాపై ఆసక్తిని కలిగించారు మేకర్స్. అంతే కాదు శనివారం థియేటర్లలో ఈ సినిమా రిలీజైన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన సిద్ధ జొన్నలగడ్డ కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లేను… దర్శకుడు విమల్ ఇంకా హీరో సిద్ధ జొన్నల గడ్డలే కలిసి రాసుకున్నారట. ఆ తర్వాత తనే హీరోగా ఈ సినిమాలో నటించారు. తాను పుట్టి పెరిగిన మల్కాజ్ గిరి ఏరియాలో డిఫరెంట్ మెంటాల్టీ ఉన్న కొందరు యువకులను చూశానని… వారు తాగినప్పుడు ఒఖలా, తాగకపోతే ఒకలా ఉంటారని హీరో సిద్ధ చెప్పాడు. వారిని చూసే తను ఈ సినిమాకు కథ రాసుకున్నట్లు చెప్పారు.
అయితే ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న వారిని తెరపై చూపిస్తే చాలా బాగుంటుందన్న ఆలోనతోనే డీజే టిల్లు సినిమాను రూపొందించారట. అయితే ముందుగా ఈ సినిమాకు నరుడు బ్రతుకు నటన అనే పేరు పెట్టాలనకున్నారట. కానీ తనకు తెలిసన వాళ్లంతా టిల్లు సంగతేంటి అని పదే పదే అడుగుతుండటంతో… ఇదే క్యాచీగా, బాగుంది అనుకొని ఈ సినిమాకు డీజే టిల్లు అనే పేరు పెట్టాలనుకున్నారట. వెంటనే అదే పేరును ఖాయం చేసేశారట. ఈ సినిమా మంచిగా ఆడితే… డీజే టిల్లు 2 ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని హీరో సిద్ధూ జొన్నల గడ్డ తెలిపారు.