రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. యాక్షన్ కింగ్ అర్జున్ షార్జ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సస్పెన్స్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టిజర్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఈ చిత్రం తర్వాత నిజానికి నక్కిన త్రినాదరావు దర్శకత్వంలో సినిమా చెయ్యాలిసింది కానీ అనూహ్యంగ ఆ సినిమాను పక్కన పెడుతూ ఓ కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు. అతనే శరత్ మండవ.
ఇతను ఆర్పి పట్నాయక్ తులసీదళం, బ్రోకర్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. అలాగే తమిళంలో బాబీ సింహా తో కో2 అనే సినిమాను చేశాడు. అజిత్ హీరోగా నటించిన బిల్లా సినిమాకు స్క్రీప్న్ ప్లే మరియు కథను అందించాడు. ఇప్పుడు నేరుగా మాస్ మహారాజ్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని కొట్టేశాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా మజిలీ సినిమాలో నాగచైతన్య తో కలిసి నటించిన దివ్యాంశ కౌశిక్ ను తీసుకున్నారు.
ఈమెకు తెలుగులో ఇది రెండోవా చిత్రం. ఈ చిత్రం యొక్క షూటింగ్ వచ్చే నెల నుండి మొదలవ్వబోతుంది. ఉగాది సందర్భంగా పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఖిలాడి తర్వాత శరత్ మండవ సినిమా సెట్స్ పైకి వెల్లుతుంది నక్కిన సినిమా కు మరికొంత సమయం పట్టేలాగా ఉంది.