ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉండాలి ? ఎలా ఉండకూడదు ? అనే కథాశంతో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రమే “చెరసాల”. ఎస్ రాయ్ క్రియేషన్స్ పతాకంపై శ్రీజిత్ ,రామ్ ప్రకాష్ గుణ్ణం, నిష్కల, శిల్పా దాస్ హీరో, హీరోయిన్లుగా
రామ్ ప్రకాష్ గుణ్ణం దర్శకత్వంలో మద్దినేని సురేష్ సుధా రాయ్ లు నిర్మిస్తున్న చిత్రం “చెరసాల”.ఈ చిత్రం టీజర్, ట్రైలర్ ను విడుదల చేయడానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి గారు “చెరసాల” టీజర్ ను విడుదల చేశారు , ఫిల్మ్ ఛాంబర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు “చెరసాల”చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. నిర్మాత ఆచంట గోపీనాథ్, బసి రెడ్డిలు “చెరసాల” చిత్రంలోని పాటలను విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
ఎస్ వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఈ చిత్ర టీజర్ ను నేను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కెమెరామెన్ దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించాడు. సినిమా మేకింగ్ చాలా బాగుంది .నిర్మాతలు దర్శకుడికి ఫ్రీడం ఇవ్వడం వలన సినిమా ఇంత బాగా వచ్చింది. దర్శక,నిర్మాతలు నాకీ సినిమాను చూయించారు. సినిమా చాలా బాగుంది.త్వరలో విడుదల అవుతున్న ఈ చిత్రం దర్శక, నిర్మాతలకు పెద్ద విజయం సాధించి మంచిపేరు తో పాటు,డబ్బులు కూడా రావాలని కోరుకుంటున్నానని అన్నారు
ఫిల్మ్ ఛాంబర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాను కొత్త వారైనా చాలా బాగా చేశారు.గత పది సంవత్సరాలుగా చిత్ర దర్శకుడు కెమెరామెన్ గా చేస్తూ 24 క్రాఫ్ట్స్ గురించి తెలుసుకొని తనే కథ తయారు చేసుకుని దర్శకుడికి మారడం చాలా మంచి శుభ పరిణామం.ఇది తనకు మొదటి సినిమా అయినా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను తెరకెక్కించాడు. ఈ మధ్య నిర్మాతలు కొత్త దర్శకులకు అవకాశం కల్పించి వారిలో ఉన్న ట్యాలెంట్ కు అవకాశం కల్పిస్తున్నారు. అలా కొత్తవారిని ఎంకరేజ్ చేసిన ఈ చిత్ర నిర్మాతలు ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి.మంచి కంటెంట్ తో వస్తున్న హర్రర్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా “చెరసాల” చిత్రం ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.
ప్రముఖ నిర్మాత ఆచంట గోపీనాథ్, బసిరెడ్డి లు మాట్లాడుతూ .. ఈ మధ్య వస్తున్న హర్రర్ సినిమాలన్నీ చిన్న సినిమాలుగా విడుదలై మంచి విజయం సాధించి పెద్ద సినిమాల సరసన చేరుతున్నాయి.త్వరలో విడుదల అవుతున్న ఈ “చెరసాల” సినిమా కూడా గొప్ప విజయం సాధించి పెద్ద సినిమాల సరసన చేరాలని కోరుతూ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేశారు.
చిత్ర దర్శకుడు రామ్ ప్రకాష్ గుణ్ణం మాట్లాడుతూ.. ఎస్వి కృష్ణారెడ్డి, ప్రసన్నకుమార్, గోపీనాథ్, బసిరెడ్డి లాంటి పెద్దలు మా సినిమాను బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి మా కృతజ్ఞతలు.చిన్నప్పటినుంచి స్కూల్ కన్నా సినిమాల మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది.స్టడీస్ తరువాత పేరెంట్స్ సినిమాలపై నాకున్న ఇంట్రెస్ట్ ను గమనించి నాకు సపోర్ట్ గా నిలిచారు. సినిమా పై ఉన్న ఇంట్రెస్ట్ తో నేను ఇండస్ట్రీ లోకి రావడానికి చాలా ఇబ్బందిపడ్డాను. ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్ గా జాయిన్ అయ్యిన నేను గత పది సంవత్సరాలుగా సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తూ.. 24 క్రాఫ్ట్స్ ఎలా వర్క్ చేస్తాయో తెలుసుకుని ఇండస్ట్రీలో నాకంటూ ఒక చిన్న గుర్తింపు ఉండాలనే తపనతో..ఈ కథ రాసుకోవడం జరిగింది ఈ కథను ప్రొడ్యూసర్ సురేష్ మాదినేని గారికి స్క్రిప్ట్ చెప్పిన వెంటనే ఇంప్రెస్ అయి వెంటనే షూటింగ్ మొదలు పెట్టమని చెప్పారు.దాంతో ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా చేస్తూ దర్శకుడిగా, నటుడిగా కూడా ఈ చిత్రంలో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
మేము ఈసినిమా కోసం కరొనా టైంలో స్ట్రగుల్ ఫేస్ అయినా ఈ సినిమా విడుదల తో మాకు హ్యాపీ ఎండింగ్ అవుతుందని ఆశిస్తున్నాను.ఇదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉండాలి ? ఎలా ఉండకూడదు ? అనే తాట్ తో ఈ సినిమా చేయడం జరిగింది. దీంట్లో ఎంటర్టైన్మెంట్తో పాటు అందరికీ నచ్చే విధంగా సైలెంట్ కామెడీ వి జోడించి చేయడం జరిగింది. నేను ఈ సినిమాను ఒక డైరెక్టర్ పాయింటాఫ్ వ్యూలో కాకుండా ఒక ఆడియన్ కు ఏది నచ్చుతుంది,ఏది నచ్చదో తెలుసుకొని ఆడియన్స్ పాయింటాఫ్ వ్యూలో అందరికీ నచ్చేలా ఈ సినిమా తీయడం జరిగింది.ఈ సినిమా విడుదల కోసం మేంమంతా క్యూరియాసిటీ గా ఎదురు చూస్తున్నాము. ప్రేక్షకులందరూ మా సినిమాను ఆదరించి ముందుకు తీసుకెళ్తే న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేసినవారవుతారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న “చెరసాల” సినిమా అందరికీ తప్పక నచ్చుతుందని
అని అన్నారు
చిత్ర నిర్మాత సుధారాయ్ మాట్లాడుతూ.. రామ్ ప్రకాష్ కెమెరామెన్ అయినా తను చెప్పిన కథకు ఇంప్రెస్స్ అయి ఈ మూవీ చేస్తున్నాము.బ్యూటీఫుల్ లోసెషన్స్ లలో తీసిన ఈ సినిమా మేము అనుకున్న దానికంటే చాలా చక్కగా వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో మీ ముందుకు వస్తున్న మా సినిమాను మీరందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరుతున్నానని అన్నారు.
చిత్ర హీరో సుజిత్ మాట్లాడుతూ ..చరసాల సినిమాను సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.బెంగళూరు నుంచి వచ్చి చేస్తున్న నా మొదటి తెలుగు సినిమా “చెరసాల” .కొత్త వాళ్లమైన మాపై నమ్మకం పెట్టి ఇందులో నటించే అవకాశం .ఇలాంటి మంచి సినిమాలో ఛాన్స్ దొరకే అదృష్టం కల్పించారు దర్శకనిర్మాతలు వారికీ నా కృతజ్ఞతలు. వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను.ఈ సినిమాలో నేను లీడ్ రోల్ ప్లే చేసినా కానీ కంటెంటే హీరో .మేమంతా ఈ కంటెంట్ ని దృష్టిలో పెట్టుకొనే నటించడం జరిగింది. ఈ సినిమా అన్ని వర్గాల వారికి
నచ్చే ఫుల్ ప్యాకేజ్డ్ మూవీ అని కచ్చితంగా చెప్పగలను.ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు అని అన్నారు
హీరోయిన్ నిష్కల మాట్లాడుతూ.. నేను కన్నడ, తమిళ్ చిత్రాలలో హీరోయిన్ గా నటించాను . తెలుగులో నేను చేస్తున్న మొదటి సినిమా “చెరసాల”.ఇందులో నాకు చాలా మంచి పాత్ర ఇచ్చారు.ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలు ధన్యవాదాలు అని అన్నారు.
హీరోయిన్ శిల్పా దాస్ మాట్లాడుతూ.. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నేను ప్రస్తుతం కన్నడలో హీరోయిన్ గా ఒక మంచి చిత్రంలో నటిస్తున్నాను. మొదటిసారి తెలుగు సినిమాలో చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.
సంగీత దర్శకుడు శంకర్ తమిరి మాట్లాడుతూ..
ఈ సినిమాలోని పాటలు స్విచ్ వేషన్ తగ్గట్లు వస్తాయి.దర్శకుడు అనుకున్న దానికంటే ఇందులోని పాటలు చాలా చక్కగా వచ్చాయి. త్వరలో విడుదల అవుతున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొని మా చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ప్రేక్షకులందరూ మా చిత్రాన్ని చూసి మమ్మల్ని, మా టీంను ఆదరించి ఆశీర్వదించాలని కోరుకొంటున్నామని తెలిపారు.