నటి త్రిష జూనియర్ ఆర్టిస్ట్ గా సినిమాలోకి వచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ సినిమా ఇండస్ష్ట్రి ని ఓ పదేళ్ళ పాటు ఏలింది. యువ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన త్రిష ఆ తర్వాత వరసగా వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, కృష్ణ, ఇలా చాలా హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగు తో పాటుగా తమిళంలో కూడా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది.
నలబై ఎండ్లకు దగ్గర పడుతున్న త్రిష ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆమె తో సినిమాలోకి వచ్చిన హీరోలకు, హీరోయిన్స్ కు పెళ్లిలు అవ్వుతున్నాయి. త్రిష మాత్రం పెళ్లి చేసుకోవడం లేదు. ఓ బిజెనెస్ మ్యాన్ తో పెళ్లి వరకు వెళ్లింది కానీ ఇద్దరి మధ్య మనస్పర్థల వలన పెళ్లి చేసుకోలేదు. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించవద్దు అని కండిషన్ పెట్టడమే కారణం అని వార్తలు వచ్చాయి.
కానీ త్రిష పెళ్లి వార్తలను ఛార్మి కౌర్ కన్ఫర్మ్ చేసింది. ఇటీవలే త్రిష పుట్టినరోజు జరిగింది. సినిమా ఇండస్ష్ట్రి కి సంబందించిన సెలబ్రేటీలు మరియు ఆమె అభిమానులు విష్ చేశారు. టాలీవుడ్ లో త్రిష కు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే ఛార్మి కౌర్. అవును త్రిష హైదరాబాద్ కు వస్తే తప్పకుండ ఛార్మిని కలుస్తుంది. సోషల్ మీడియాలో వీరి ఫోటోలు తెగ కనిపిస్తాయి. త్రిష కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే త్రిష బ్యాచిలర్ లాస్ట్ పుట్టినరోజు అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ తో త్రిష త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అని అర్థం అవ్వుతుంది. అటు త్రిష నుండి కూడా ఛార్మి ట్వీట్ కు ఎలాంటి రెస్పాన్స్ లేదు. చెన్నయ్ కు చెందిన ఓ వ్యాపార వేత్తతో త్రిష పెళ్లి ఈ ఏడాది జరగబోతుందని బయట ఓ టాక్ వినపడుతుంది.