తెలుగు బిగ్ బాస్ లో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గంగవ్వ ఆరంభంలో అందరిని ఆకట్టుకుంది. మై విలేజ్ షో వీడియోల ద్వారా ఆమె తెలుగు వారందరికీ దగ్గర అయిన విషయం తెలిసిందే. ఆ వీడియోల్లో మాదిరిగానే బిగ్ బాస్ హౌస్ లో కూడా ఆమె చాలా యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని అంతా భావించారు. అనుకున్నట్లుగానే మొదటి వారం పర్వాలేదనిపించింది. కాని రెండో వారం మాత్రం నేను ఉండలేను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ సమయంలో అంతా కూడా ఆమెకు మద్దతుగా బయటకు పంపించాలంటూ విజ్ఞప్తి చేశారు.
మూడవ వారం నుండి ఆమె ఎలాంటి ఇబ్బంది లేకుండా హౌస్ లో ఉంటుంది. కానీ ఆమె టాస్క్ ల్లో మాత్రం చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందంటూ నెటిజన్ కామెంట్ చేస్తున్నారు. ఆమె వల్ల ఇతరుల ఆట డిస్టర్బ్ అవుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గంగవ్వ ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండడం చాలా గొప్ప విషయం. ఆమెకు ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. మొదటి రెండు వారాలు ఎలిమినేషన్ కు నామినేట్ అయిన గంగవ్వ ఆ తర్వాత మూడు వారాలు వరుసగా ఎలిమినేషన్ కు దూరంగా ఉంటుంది. ఈ సారి ఎలిమినేషన్ లో ఎవరు ఉంటారు అనుకుంటున్న సమయంలో గంగవ్వ ఈసారి కూడా లేదని క్లారిటీ వచ్చేసింది. ఈ సారి కూడా గంగవ్వ సేవ్ అయిపోతుంది.
వచ్చే వారం కూడా గంగవ్వ సేవ్ అయితే మొత్తం ఆరు వారాలు ఆమె ఇంట్లో ఉన్నట్లు గా అవుతుంది. ఇన్ని వారాలు ఆమె ఇంట్లో ఉంటుందని ఎవరూ భావించలేదు. ఆమెను నామినేట్ చేయడానికి ఎవరు కూడా సాహసించడం లేదు. ఆ కారణంగానే ఆమెను ఇంట్లోనే కొనసాగించాల్సి వస్తుంది.
మొదటి నుంచి అనుకుంటున్నట్లు గంగవ్వ బయటికి వెళ్ళాలి అని తనంతట తాను అనుకుంటే తప్పితే ఆమె ఫైనల్ వరకు అలాగే కొనసాగే అవకాశం ఉందని అనిపిస్తుంది. అప్పటి వరకు ఉంటుందా లేదా మధ్యలో వెళ్ళిపోతే ఉంటుందా అనేది చూడాలి. కొందరు ప్రేక్షకులు మాత్రం ఆమె ఇక బయటకు వస్తే అన్ని విధాలుగా బాగుంటుందని ఇంకా అక్కడే కొనసాగితే విమర్శలు మరింతగా ఎక్కువై ఆమెకు వచ్చిన క్రేజ్ మొత్తం పడిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.