మూడు రోజుల క్రితం ట్విట్టర్‌లో మహేష్ బాబు బర్డ్ డే కామన్ డీపీ హ్యాష్ ట్యాగ్ ను 24 గంటల్లో 3.1 కోట్ల ట్వీట్స్ చేయడంతో ఆల్ ఇండియా రికార్డ్‌ను మహేష్ బాబు ఫ్యాన్స్ దక్కించుకున్నారు. అంతకు ముందు ఈ రికార్డ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పేరిట ఉంది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే అంటూ ఒక హ్యాష్ ట్యాగ్‌ను పవన్ ఫ్యాన్స్ రెండున్న కోట్లకు పైగా ట్వీట్స్ చేశారు. ఎన్టీఆర్ బర్త్ డే హ్యాష్ ట్యాగ్ తో మొదలైన ఈ ట్విట్టర్ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. మహేష్ ఫ్యాన్స్ పేరుతో ఉన్న ఈ రికార్డును బ్రేక్ చేసేందుకు ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆగస్టు 15వ తారీకున పవన్ కళ్యాణ్ బర్త్‌డే కామన్ డీపీని విడుదల చేయబోతున్నారు. ఆ సమయంలో ట్విట్టర్‌లో పవన్ బర్త్ డే కామన్ డీపీ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. 24 గంటల్లో ఆ హ్యాష్ ట్యాగ్ ను 3.7 కోట్ల వరకు ట్వీట్స్ చేయాలని పవన్ ఫ్యాన్స్ ట్రెండ్ అలర్ట్ చేశారు. ట్విట్టర్ లో పవన్ ఫ్యాన్స్ గతంలో సాధించిన రికార్డులు అన్ని ఇన్నీ కావు. కనుక ఈసారి నాలుగు కోట్ల ట్వీట్స్ కూడా సాధ్యమే అంటూ ట్రెండ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఆ ఏర్పాట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. హీరోలకు సంబంధం లేకుండా ఈ ట్రెండ్స్ జరుగుతూ ఉంటాయి. ఇందులో హీరోల ఇన్వాల్వ్‌మెంట్ ఏమీ ఉండదు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే తమ అభిమాన హీరో హ్యాష్ ట్యాగ్ అంటూ దాన్ని వందల సంఖ్యలో ట్వీట్స్ చేస్తూ ఉంటారు. ఈ ట్విట్టర్ ట్రెండ్ రికార్డుల నేపథ్యంలో ఫ్యాన్స్ పిచ్చొల్లు అవుతున్నారు. నాలుగు కోట్ల ట్వీట్స్ రాగానే ఫలితం ఏంటో అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ ఆల్ ఇండియా రికార్డు దక్కించుకున్న వెంటనే ఏమైన ఫలితం ఉంటుందా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.