సినీ ప్రముఖులను కరోనా భయపెడుతుంది. టాలీవుడ్‌లో బండ్ల గణేష్‌తో కరోనా వైరస్ దాడి మొదలైంది. ఆ తర్వాత టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులను కూడా కరోనా ఇబ్బంది పెట్టింది ఇంకా పెడుతూనే ఉంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్‌కు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన సమయంలో అంతా ఆశ్చర్యపోయారు. ఎంతో జాగ్రత్తగా ఉండటంతో పాటు ఎన్నో ముందస్తు చర్యలు తీసుకున్న బచ్చన్ కు మరియు ఆయన ఫ్యామిలీకి ఎలా కరోనా వచ్చిందో అర్థం కావడం లేదు అంటూ ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడు అదే విధంగా జక్కన్న విషయంలో కూడా ఆశ్చర్యపోతున్నారు. అసలు జక్కన్న రాజమౌళికి కరోనా ఎలా సోకింది అనేది ప్రతి ఒక్కరి ప్రశ్న. రాజమౌళి ఇలాంటి విషయాలో చాలా జాగ్రత్తలు పాటించినట్లుగా అనిపిస్తాడు.
కరోనా విషయంలో ప్రజలను ఉత్తేజ పర్చడంలో మరియు దానికి సంబంధించిన అవగాహణ కల్పించడంలోనూ రాజమౌళి చాలా ముందు ఉన్నాడు. ఆయన ట్వీట్స్ మరియు వీడియోలు చాలా మందిని ఆలోచింపజేసి మాస్క్‌లు ధరించేలా చేశాయి. కాని ఆయన మాత్రం కరోనా బారిన పడ్డాడు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉండే తన ఫామ్ హౌస్‌కు వెళ్లాడు. అక్కడే కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులతో కలిసి సంతోషంగా సమయం గడుపుతున్నాడని ఇలాంటి సమయంలో ఎలా ఈ మహమ్మారి ఆయనకు అంటింది అనే విషయం ఇండస్ట్రీ వర్గాల వారికి కూడా తెలియడం లేదు. తాజాగా ఈ విషయం గురించి ఒక వర్గం వారు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం రాజమౌళి తనయుడు కార్తికేయ ఒక ఈవెంట్ ను నిర్వహించాడు. కేవలం 50 మంది పాల్గొన్న ఆ ఈవెంట్ లో కార్తీకేయ పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో కార్తికేయకు వైరస్ సోకి ఉంటుందని, ఆయన ద్వారా రాజమౌళికి మరియు తల్లి రమా రాజమౌళికి ఇతర కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి కుటుంబ సభ్యులు అంతా కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. వారు వారం నుండి పది రోజుల్లోనే బయట పడే అవకాశం ఉందని వైధ్యులు పేర్కొన్నారు. రాజమౌళి త్వరగా కోలుకోవాలంటూ చాలా మంది ట్విట్టర్ ద్వారా కోరుకుంటున్నారు.