ఆవుల గిరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ అభిమానుల మద్య గొడవ పెట్టే ప్రయత్నం చేశాడు. నందమూరి అభిమానులు రెండుగా చీలేంతటి వ్యాఖ్యలను చేశాడు. ఆయన ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలని విడుదల సమయంలో దేవి థియేటర్ ను ఇవ్వడం జరిగింది. అప్పటికే ఆ థియేటర్ లో నరసింహనాయుడు సినిమా ఆడుతోంది. 150 రోజులు పూర్తి చేసుకున్న నరసింహా నాయుడు సినిమాను తీసేసి నిన్ను చూడాలని సినిమాకు ఆ థియేటర్ ఇవ్వడంతో బాలయ్య నాకు ఫోన్ చేసి ఎలా థియేటర్ ఇస్తావు అంటూ నన్ను కోపాడ్డాడు అంటూ ఆవుల గిరి వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో బాలయ్య కు ఎన్టీఆర్ అంటే కోపం అప్పట్లుగా ఆవుల గిరి మాటలు ఉన్నాయి. అయితే ఆవుల గిరి మాటలను నందమూరి అభిమానులు కొట్టి పారేస్తున్నారు. ఆయన ప్రచారం కోసం పబ్లిసిటీ కోసం ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ఆరోపణలు గుప్పించారు.
భాస్కర్ అనే బాలయ్య అభిమాని ట్విట్టర్ ద్వారా ఆవుల గిరికి గట్టి సమాధానం ఇచ్చాడు. నందమూరి అభిమానులు ఇలాంటి పుకార్లను వ్యాఖ్యలను నమ్మవద్దంటూ విజ్ఞప్తి చేస్తూ క్లారిటీ ఇచ్చాడు. ఆయన ట్విట్టర్ లో… నిన్నుచూడాలని రిలీజ్ అయింది మే 23 2001, అప్పటికి నరసింహనాయుడు 130+ డేస్ తో రన్ అవుతుంది దేవి థియేటర్లో. ఇక్కడ కింద చెప్పినట్టు 100 డేస్ కోసం ఆపారు అనేది బూతు. ఇంకా దేవి థియేటర్ అగ్రిమెంట్ నిన్ను చూడాలని కి కేవలం 2 వారాలు మాత్రమే , తర్వాత నాగ్ బావ నచ్చాడు (జూన్ 7th రిలీజ్ )సినిమాకి ఇస్తాం అనేది అగ్రిమెంట్. అప్పటికే 53 రోజుల పాటు 212 షోలు హౌస్ ఫుల్ గా రన్ అయి , Crossroad హిస్టరీలో బెస్ట్ రన్ అవుతూ వస్తున్న సినిమాని 2 వారల కోసం 175 డేస్ ఆడాల్సిన మెయిన్ థియేటర్ ని , నిన్ను చూడాలని కోసం సబ్ థియేటర్ గా ఇవ్వలేదు అని మీ గోల.. అయిన ఈరోజు ఈ సగం సగం విషయాలు చెప్పే పుహన గాళ్ళ వీడియోలూ రీ ట్వీట్లు కొట్టె 90 శాతం పిల్ల ఫ్యాన్స్ ఆ రోజుకి డైపర్లు వేసుకుంటూ ఉంటారు… తెలిస్తే మాట్లాడండి , లేదా కోడి గుడ్డు మీద ఇలానే ఈకలు పీకండి.
అబద్దాలు ను నిజాలుగా మాట్లడడం కరెక్ట్ కాదు. ఈ సినిమా హైదరాబాద్ రన్నింగ్ విషయంలో నందమూరి బాలకృష్ణ గారు ఏ ఒక్కరికీ ఫోన్ చేయలేదు. మేము బి.గోపాల్ గారి తో 175 కు ట్రై చేస్తే, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత హాండ్ ఇస్తే, 127 రోజు నుండి అభిమానుల వలన 175 రన్నింగ్ వచ్చింది. నరసింహ నాయుడు 126వ రోజున డైరెక్టర్ బి.గోపాల్ గారి ఇంట్లో మేడికొండ మురళి కృష్ణ గారి చినబాబు సమక్షంలో మహలక్షి ఫిలింస్ డిస్ట్రిబ్యూటర్ 175 రోజులు కన్ఫర్మ్ అని చెప్పి మరుసటి రోజు నుండీ అడ్రస్ లేకుండా వెళ్ళిపోతే, డెఫిషిట్ లేకుండా రన్ అవుతున్న సినిమా ను మేము 175 రోజులు ఆడాం ఇది నిజం అంటూ నందమూరి అభిమానులకు అసలు విషయాలను తెలియజేశారు. నందమూరి అభిమానులు చెప్పుడు మాటలు విని.. అబద్దపు పుకార్లు నమ్మవద్దంటూ మా తరపున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.