దేశ వ్యాప్తంగ కరోనా సెకండ్ వేవ్ యమ స్పీడ్ గా వ్యాపిస్తుంది. ప్రజలు ఈ మహమ్మారి భారీన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. రోజుకు లక్షలల్లో కేసులు నమోదు అవ్వుతుంటే వేలల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. భారత ప్రభుత్వం మాత్రం కరోనా ను కట్టడి చేయడంలో విఫలం అయిందనే చెప్పాలి. మస్కూలు, సానిటైజర్స్, సోషల్ డిస్టన్స్ పాటించాలను డాక్టర్స్ , ప్రభుత్వాలు చెబుతున్న కొంత మంది నిర్లక్షం వలన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
కరోనాకు బాగా ఎఫెక్ట్ అవ్వుతుంది అంటే సినిమా సెలబ్రేటీలు, రాజకీయనాయకులు, జర్నలిస్ట్ లు, ప్రవేట్ ఉద్యోగులు, ఎక్కువ సంఖ్యలో కరోనా భారినా పడుతున్నారు. ప్రముఖ జర్నలిస్ట్, మరియు సినిమా నటుడు టిఎన్‌ఆర్ గారికి గత కొద్ది రోజుల క్రితం కరోనా రావడంతోఇంట్లోనే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. ఇటీవలే ఆయన ఆరోగ్యం విషమించడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. అయితే గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం పరిస్థితి సీరియస్ గానే ఉంది. ఈ క్రమంలో నేడు ఆయన ఆరోగ్యం విషమించడంతో కాసేపటి క్రితమే కన్ను మూశాడు. ఆయన మరణంపై టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
టిఎన్‌ఆర్ గారు ప్రముఖ యూట్యూబ్ చానల్ ఐ డ్రీమ్ ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. సినిమా సెలబ్రేటీలు, రాజకీయనాయకులను ఇంటర్వ్యూ చేస్తూ వెలుగులోకి వచ్చాడు. ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య, అనే సినిమా టిఎన్‌ఆర్ కు మంచి గుర్తింపు తీసుకు వచ్చింది. ఆ తర్వాత తెలుగులో ఓ పది సినిమాలకు పైగానే నటించాడు. ఆయన మరణం జర్నలిస్ట్ లకు, సినిమా కు తీరని లోటు.