ఒక్కప్పుడు తెలుగు, తమిళ, హింది సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చెయ్యాలంటే ప్రత్యేకమైన నటీమణులు ఉండేవారు. వారు కేవలం ఆ పాటలకే పరిమితం అయ్యేవారు. కానీ నేడు ఆ పరిస్థితి మారిపోయింది. సినిమాల్లో ఐటెమ్ సాంగ్ లు చేయడానికి స్టార్ హీరోయిన్స్ పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఒక్క ఐటెమ్ సాంగ్ చేస్తే 30 నుండి 50 లక్షల వరకు ఇస్తున్నారు. ఒక్క ఐదు నిమిషాల పాటకోసం అంత పారితోషికం తీసుకుంటున్నారు. హీరోయిన్ గా ఫుల్ లేన్త్ రోల్ సినిమాలో నటించిన అన్నీ డబ్బులు రావు. ఐటెమ్ పాటలకు అంత డిమాండ్ ఉంది నేడు.
పూజ హెగ్డే, శృతి హాసన్, ఛార్మి కౌర్, కాజల్ అగర్వాల్ లు టాలీవుడ్ లో మంచి పేరు ఉన్న హీరోయిన్స్. ఇదే హీరోయిన్స్ ఐటెమ్ సాంగ్స్ లో నటించి ఇరగదీశారు. మన దర్శకులు కూడా హీరోయిన్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇది ఇలా ఉంటే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే చిత్రం రూపొందుతుంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే సగ బాగం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
బన్నీ, రష్మిక తో ఓ రెండు రొమాంటిక్ సాంగ్ లను పూర్తి చేసుకున్నాడు. త్వరలో మాస్ స్టెప్ లకు సిద్దం కాబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. సుకుమార్ పుష్ప చిత్రంలోని ఓ ఐటెమ్ సాంగ్ కోసం కాజల్ అగర్వాల్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా టాలీవుడ్ మీడియా నుండి అందుతున్న సమాచారం.
జనతా గ్యారేజ్ లో పక్క లోకల్ సాంగ్ తో ఎన్టిఆర్ తో మాస్ స్టెప్ లు వేసి ఆకట్టుకుంది. కాజల్ పెళ్లి అయిన సినిమాలు మాత్రం వదలడం లేదు. ఛాన్స్ వచ్చిన ప్రతి సినిమాకు ఒకే చెబుతుంది. అలాగే ఇప్పుడు ఐటెమ్ సాంగ్ లను కూడా వదిలి పెట్టేలాగా లేదు. సుకుమార్ మాత్రం కాజల్ అయితేనే ఆ మాస్ సాంగ్ కు న్యాయం చేగలదని భావిస్తున్నాడు.