మలయాళ నటి సితారా గురించి అందరికి తెలిసిన విషయమే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ బాషల్లో హీరోయిన్ గా నటించింది. వయసు మీద పడటంతో ప్రస్తుతం తనకు తగ్గ పాత్రలు, అక్క, వదిన, అమ్మ, చెల్లి, అత్త, వంటి పాత్రలు చేస్తుంది. జీవితంలో ఈ నటి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంది. అందుకు కారణం తమిళ సినిమాకు చెందిన ఓ హీరో తో ఈమె చాలా స్నేహంగ ఉండేవారు అంట.
అయితే అతను చాలా చిన్న వయసులో అనారోగ్యానికి గురై చనిపోవడం జరిగింది. అతని మరణం ను సితారా జీర్ణించుకోలేక పోయింది. అందుకే జీవితంలో తను మరో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోవాలి అనుకుంది. అదే టైంలో తన నాన్న కూడా చనిపోవడంతో ఆమె ఒంటరి అయిపోయింది. ఇక అప్పటి నుండి ఆమెకు తెలిసింది ఒక్కటే సినిమా సినిమా..
తనకు అవకాశం వచ్చిన ప్రతి సినిమాల్లో నటిస్తూనే తనను తాను మర్చిపోయింది. ప్రస్తుతం సినిమా ఇండస్ష్ట్రి లో చాలా మంది రెండో పెళ్లి చేసుకొని సంతోషం గా ఉంటున్నారు. రెండో పెళ్లి విషయమై సితారా ను అడిగితే ఆమె నాకు మరో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని తేల్చి చెప్పేసింది. సితారా ఒక్క సినిమా తెరపైనే కాకుండా బుల్లి తెరపై కూడా నటించింది. అవును చాలా సిరియల్స్ లలో ప్రధాన పాత్రలు చేసింది.