ఏపీ లో సినిమా టికెట్ల రేట్ల విషయం గత కొన్ని రోజులుగా తెగ చర్చ జరుగుతోంది. అక్కడ టికెట్ల రేట్లు మరీ దారునంగా అయిదు పది ఇరువై రూపాయలు ఉండటంతో అక్కడ థియేటర్లను నడపడం మా వల్ల కాదంటూ చాలా మంది చేతులు ఎత్తేశారు. టికెట్ల రేట్లు తక్కువగా ఉండటం వల్ల పక్కన ఉన్న కిరాణం షాపు కంటే కూడా థియేటర్ లో సినిమా కలెక్షన్స్ తక్కువగా ఉన్నాయి అంటూ నాని చేసిన వ్యాఖ్యలు దుమారంను రేపాయి. దాంతో నాని మౌనం వహిస్తున్నాడు. ఇక టికెట్ల రేట్ల విషయంలో ఉన్న వివాదంను తొలగించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటి తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అన్ని వర్గాల వారి అభిప్రాయాలను తీసుకుని ఒక రిపోర్ట్ ఇవ్వబోతున్నట్లుగా చెబుతున్నారు.
ఏపీలో టికెట్ల రేట్ల విషయంలో విపక్ష పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో కొందరు ఏపీ ప్రభుత్వంకు మద్దతు తెలుపుతున్నారు. కొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకంగా ఉన్న వారు మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదు. కాని కొందరు మాత్రం అంతర్ఘతంగా మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా సినిమా వ్యతిరేక విధానాలు పాటిస్తుంది. వారి ఆలోచన ఏంటో అర్థం కావడం లేదు అన్నాడు. ఆయన మాటల్లో నిజం ఉంది. సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ను కసమీక్షించుకోవాలంటూ చాలా మంది కోరుతున్నారు. ఇలాంటి టికెట్ల రేట్లు ఉంటే సినిమాను ఎలా విడుదల చేసేది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా టికెట్ల విషయం పై తాజాగా సీఎం స్పందించే వరకు వెళ్లింది.
ఇటీవల ఒక అధికారిక ప్రభుత్వ కార్యక్రమం జరిగిన సమయంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ తనకంటూ ఒక ఆలోచన ఉందన్నట్లుగా చెప్పుకొచ్చాడు. సామాన్య ప్రజల కు అందుబాటులో సినిమా టికెట్ల రేట్లను తగ్గిస్తే కొందరు విపక్ష పార్టీల వారు దాన్ని కూడా రాద్దాంతం చేస్తున్నారు. సినిమా పరిశ్రమ ప్రతి ఒక్కరు కూడా చేరువగా ఉండాలని అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా టికెట్ల రే్లు పెంచామే తప్ప ఎక్కువ లేనే లేదు అన్నాడు. ఈ విషయంలో ప్రజలకు వినోదాన్ని అందించడం కొందరికి ఇష్టం లేదు అనుకుంటా అంటూ వైఎస్ జగన్ వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. ఏపీ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే టికెట్ల రేట్ల విషయం లో వెనక్కు తగ్గేది లేదు అన్నట్లుగా తెలుస్తోంది. జగన్ ను త్వరలోనే ఇండస్ట్రీ కి చెందిన వారు కలిసే అవకాశం ఉందని అంటున్నారు.