![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2022/02/who-is-pink-shirt-girl-with-hero-dhanush-in-restaurant.jpg?resize=800%2C500&ssl=1)
తమిళ సూపర్ స్టార్ ధనుష్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది. అటు తమిళ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా… టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని భాషల అభిమానులను అలరించిన అతి కొద్ది మంది నటుల్లో ధనుష్ కూడా ఒకరు. బాలీవుడ్ లో ఆ మధ్య తీసిన ఆత్రాంగి రే సినిమా మంచి హిట్ కొట్టి అటు అభిమానులో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఆ ఒక్క సినిమాతోనే కాకుండా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన ధనుష్ దేశ సినీ ప్రేక్షకులను తన నటనా ప్రతిభతో విశేషంగా ఆకట్టుకున్నాడు. తనదైన నటనతో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించాడు.
![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2022/02/who-is-pink-shirt-girl-with-hero-dhanush-in-restaurant-1.jpg?resize=680%2C680&ssl=1)
అయితే ఇటీవలే ఆయన తన భార్య ఐశ్వర్యంతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులతో పాటు అందరినీ షాక్ కి గురి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్లిన ఆయన ఓ రెస్టారెంట్ లో లంచ్ చేశాడు. అయితే ఆయన భోజనం చేస్తున్న కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ఆ ఫొటోల్లో ఓ అమ్మాయి కూడా ఉంది. అయితే ఆ అమ్మాయి ఎవరంటూ అందరూ షేర్ చేస్తుండటంతో ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి.
విడాకుల విషయం పక్కన పెడితే ధనుష్ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నాన్ ఒరువేన్ అనే సినిమా చేస్తూనే మరో వైపు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వాతి, సార్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ క్రమంలోనే ధనుష్ రెస్టారెంట్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫటోలనే చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేశారు.