FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
FeaturedNewsతెలుగు న్యూస్

హీరోయిన్స్‌ చనిపోయినప్పుడు మీరు ఎటు పోయారు : విజయశాంతి

by Ramesh September 4, 2020
837

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వౌరీ వేయించిన విషయం తెల్సిందే. సుశాంత్‌ది ఆత్మహత్య అంటూ ముంబయి పోలీసులు దాదాపుగా నిర్థారించారు. అయినా కూడా వదలకుండా సీబీఐకి అప్పగించారు. దాంతో ఇప్పుడు పలు నిజాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసును సీబీఐ వారికి అప్పగించడం మంచిది అయ్యిందని ఇప్పుడు చాలా మంది వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇదే సమయంలో పాత కేసుల విషయంలో కూడా ఇలాగే వ్యవహరించి ఉంటే బాగుండేది కదా అన్నట్లుగా విజయశాంతి కొత్త విషయాన్ని లేవనెత్తింది. విజయశాంతి ఫేస్‌ బుక్‌ లో సుశాంత్‌ కేసును సీబీఐ ఎంక్వౌరీ చేస్తుండటంతో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాగే గతంలో మృతి చెందిన హీరోయిన్స్‌ కేసుల్లో కూడా సీబీఐ ఎంక్వౌరీ వేస్తే బాగుండేది అంటున్నారు. పలువురు హీరోయిన్స్‌ మృతి విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. కాని వాటిని సీబీఐకి ఇవ్వక పోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది. ఫేస్‌ బుక్‌ లో ఆమె సుదీర్ఘ పోస్ట్‌ పెట్టి అందరిని ఆలోచింపజేసింది.

ఆమె ఫేస్‌ బుక్‌ పోస్ట్‌ ఉన్నది ఉన్నట్లుగా… బాలీవుడ్ యువహీరో సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుక వాస్తవాల్ని వెలికితీసేందుకు ప్రభుత్వాలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. దోషుల్ని పట్టుకోవడానికి సీబీఐ విచారణకు సైతం ఆదేశించడం హర్షణీయమే గానీ… మన సినీరంగంలో ఒకప్పుడు ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుని ఎందరో నటీమణులు బలవన్మరణాలకు పాల్పడిన సంగతి మనందరికీ తెలుసు. వారిలో ఒక్కరి ఆత్మకైనా శాంతి కలిగించేలా ఈ స్థాయిలో విచారణలు… దర్యాప్తులు జరిగాయా? చాలామంది నటీమణులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినప్పుడు నామమాత్రంగా కేసులు నమోదు కావడం, తూతూ మంత్రంగా విచారణ చేసి చివరకి మమ అనిపించడమే చూశాం. సుశాంత్ కేసులో బయటకొస్తున్న విషయాలు చూస్తుంటే విస్మయం కలుగుతోంది. వెండితెరపై వెలగాలని ఎన్నో ఆశలతో వచ్చే కళాకారులు ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురవడం బాధాకరం. అయితే దర్యాప్తులు, విచారణలనేవి వివక్ష లేకుండా ఎవరి విషయంలోనైనా ఒకేలా ఉండాలి. ఈ విషయంపైన ఒక జాతీయ టీవీ చానెల్‌లో జరిగిన చర్చ సందర్భంగా ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే స్పందిస్తూ… సెలబ్రిటీలకైనా, సామాన్యులకైనా న్యాయప్రక్రియ ఒకే తీరులో కొనసాగాలని, అప్పుడే న్యాయాన్ని ఆశించగలమని అన్నారు. సంచలనాత్మకమైన ఇలాంటి ఎన్నో కేసుల విచారణ క్రమాన్ని గమనిస్తే, తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో ఏసీబీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఎంతో శ్రమించి కోర్టులకు తగిన ఆధారాల్ని సమర్పించిన తర్వాత కూడా… వారు ఆశించిన ఫలితం రాకుంటే ప్రభుత్వాలు అప్పీలుకు వెళ్ళకపోవడం వల్ల శిక్షలు పడే అవకాశం బలంగా ఉన్న కేసులు సైతం నీరుగారుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

Anasuya Latest Photos

Kavya Kalyanram Photos at SIIMA 2023

Ananya Nagalla Photos at SIIMA 2023

Mrunal Thakur Photos at SIIMA 2023

SIIMA Awards 2023 Pressmeet Photos

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Krithi Shetty Latest Photos

  • 2

    Meenakshi Chaudhary Latest Photos

  • 3

    Kushi Music Concert Photos HD

  • 4

    Telugu Anchor Manjusha Latest Photos

  • 5

    Anasuya Latest Photos

  • 6

    Nidhhi Agerwal Latest Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews