హైదరాబాద్ కుర్రాడు విజయ్ దేవరకొండ తెలుగు తో పాటుగా హింది కూడా వచ్చి ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొంచెం ఉర్దు మిక్స్ అయి ఉంటుంది. ఇప్పుడు విజయ్ హింది గురించి ఎందుకు చెప్పుకుంటున్నం అంటే ఆయన ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంను తెలుగు తో పాటుగా మొత్తం అయిదు బాషలో విడుదల చేస్తున్నారు.
హింది వెర్షన్ లో కూడా ఈ చిత్రం విడుదల అవ్వుతుంది కావున విజయ్ దేవరకొండ ఆయన పాత్రకు ఆయనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు అంట. ఇక్కడ అసలు సమస్య ఏమిటి అంటే నార్త్ సైడ్ వాళ్ళు ప్యూర్ హింది మాట్లాడుతారు. హింది టచ్ ఉన్న విజయ్ ఆ చిన్న సమస్యను ఎలాగైనా ఆదిగమించగలాడు అని తెలుస్తుంది. ఈ చిత్రం ద్వారా విజయ్ బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు. ఇక నుండి అక్కడ సినిమా ఛాన్స్ లు వస్తే తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకుంటున్నాడు. మరి ప్యూర్ హింది లాంగ్వేజ్ తో రౌడీ స్టార్ అక్కడి ప్రేక్షకులను మెప్పించగలడా అనే విషయం తెలియాలి అంటే లైగర్ విడుదల కావాలిసిందే.
లైగర్ సినిమా షూటింగ్ విషయానికి వస్తే మొదటి నుండి కూడా ముంబయి నేపథ్యంలోనే షూట్ చేస్తున్నారు. అక్కడ ఉన్న అందమైన ప్లేస్ లలో షూట్ జరుగుతుంది. మొదటి షెడ్యూల్ ను ఇప్పటికే పూరీ పూర్తి చేశాడు. ఇప్పుడు జరుగుతున్నా సెకండ్ షెడ్యూల్ తో సినిమా పూర్తి అవ్వుతుంది. బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాని పూరీ కనెక్ట్స్ ధర్మ ప్రొడక్షన్స్ పై ఛార్మి కౌర్, కరణ్ జోహర్ లు నిర్మిస్తున్నారు.