ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ సంస్థల ఎమ్.డి.. జర్నలిస్ట్.. సంపాదకులు శ్రీ వేమూరి రాధాకృష్ణ గారి సతీమణి శ్రీమతి కనకదుర్గ గారు తుదిశ్వాస విడిచారని తెలసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. జీవిత భాగస్వామికి నిజమైన నిర్వచనంగా మీ ప్రతి అడుగులో అడుగైన కనకదుర్గ గారి అకాల మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ దుఃఖ సమయంలో మీరు తట్టుకొనే శక్తి ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ, మీ కుటుంబమంతటికీ నా సంతాపం తెలియజేసుకుంటున్నాను.