రైటర్ గా తన సినీ ప్రస్థానం మొదలుపెట్టిన మాటల మాంత్రికుడు ఆ తర్వాత స్క్రీన్ ప్లే , డైరెక్టర్ గా మారి తన సత్తా చాటుకుంటూ వస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకొనే టాప్ త్రీ లో ఈయన ఒకరు. అలాంటి ఈయన రానా చిత్రానికి మాటలు రాస్తున్నట్లు ఓ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుణ శేఖర్ దర్శకత్వంలో రానా హీరోగా ‘హిరణ్య కశ్యప’ అనే పౌరాణిక సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. గత 3ఏళ్లుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ సినిమాకు మాటలు అందించమని త్రివిక్రమ్ ను గుణశేఖర్ కోరినట్లు తెలుస్తోంది. అయితే దీనికి త్రివిక్రమ్ ఎస్ లేదా నో రెండూ చెప్పలేదట. చూద్దాం అన్నట్లుగా బదులిచ్చి వదిలేసారని తెలుస్తోంది. అయితే మళ్లీ గుణశేఖర్ యాక్టివ్ గా ఆ విషయం ముందుకు తీసుకురాలేదని తెలుస్తోంది.
తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో దాదాపు రూ.180 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. పౌరాణిక సినిమాలు తెరకెక్కించిన అనుభవం గుణ శేఖర్ కు ఉంది. జూనియర్ ఎన్టీఆర్ బాలనటుడిగా ‘రామాయణం’ వంటి పౌరాణిక సినిమాను తెరకెక్కించిన ఎక్స్ పీరియన్స్‌తో ఇపుడు రానా హీరోగా ‘హిరణ్య కశ్యప’ మూవీ శ్రీకారం చుట్టాడు. ఈ సినిమా గతంలో వచ్చిన భక్త ప్రహ్లాద కథే అయినప్పటికీ ఈ సినిమాను గుణ శేఖర్ హిరణ్యకశ్యపుడి కోణంలో తెరకెక్కించబోతున్నాడు. వాస్తవానికి గుణశేఖర్ ‘రుద్రమదేవి’ చిత్రం తర్వాత వెంటనే ఈ చిత్రాన్ని ప్రకటించారు. కానీ స్క్రిప్ట్ వర్క్ విషయంలోనే ఆలస్యమవుతూ వస్తుంది. ఇక ఈ లాక్‌డౌన్‌లో గుణశేఖర్ స్క్రిప్ట్‌తో పాటు ప్రీ పొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. ఇక ఈ చిత్రానికి వరల్డ్ బెస్ట్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నారట.