చిత్రసీమలో సెంటిమెంట్ ను ఎక్కువగా నమ్ముతారు..ఇది అందరికి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సైతే గతకొంతకాలంగా ‘అ’ అనే సెంటిమెంట్ ను నమ్ముతున్నాడు. ‘అ’ పేరు వచ్చేలా టైటిల్స్ పెడుతూ విజయాలు అందుకుంటూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ అ సెంటిమెంట్ కు బ్రేక్ చేసాడనే వార్తలు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.
అల వైకుంఠపురం లో చిత్రం తో భారీ విజయాన్ని అందుకున్న త్రివిక్రమ్..త్వరలో ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి ‘రాజా వచ్చినాడు’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. కథానుసారం ఈ టైటిల్ అయితే బాగుంటుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. అ సెంటిమెంట్ ను ఈసారికి పక్కన పెట్టి కథకు సెట్ అయ్యే విధంగా ఈ సినిమాకు రాజా వచ్చినాడు టైటిల్ ను పెట్టాలని ఫిక్స్ అయినట్లు అంటున్నారు. మరి సెంటిమెంట్ బ్రేక్ చేసి ఎన్టీఆర్ తో సినిమా చేస్తుండడం తో అభిమానుల్లో కాస్త ఆందోళన మొదలవుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ..రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.