
దేశ వ్యాప్తంగ కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా విస్తరిస్తుంది. రోజుకు లక్షలల్లో కేసులు నమోదు అవ్వుతున్నాయి. వేలల్లో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఇండియన్ గవర్నమెంట్ మాత్రం లాక్ డౌన్ వైపు అడుగులు వేయడం లేదు. సానిటైజర్స్ వాడండి మస్కూలు ధరించండి అంటూ చెబుతుంది. అయిన కొంతమంది వాటిని వాడకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే ఆక్సిజన్, మెడిసిన్ దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవ్వుతున్నారు.
ఇది ఇలా ఉంటే ఇప్పుడు దేశం మొత్తం మీద వ్యాక్సిన్ కొరత కూడా ఏర్పడింది. గవర్నమెంట్ టీకాలు వేయడం కూడా ఆపేసింది. ఇప్పటి వరకు మొదటి డోస్ వేసుకొని రెండో డోస్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇక సినిమా ఇండస్ష్ట్రి లో కరోనా టీకా తీసుకున్న వారు ఎవరెవరు అంటే చిరంజీవి ఫ్యామిలీ మొత్తం టీకా తీసుకుంది.

అలాగే కింగ్ నాగార్జున ఫ్యామిలీ కూడా ఈ టీకా వేసుకుంది. మోహన్ బాబు కరోనా టీకా తీసుకొని తన అభిమానులు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పాడు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు నమ్రతా లుకూడా వ్యాక్సిన్ వేసుకున్నారు. నిర్మాత అల్లు అరవింద్ కరోనా టీకా వేసుకున్న కూడా కోవిడ్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే మాధురి దీక్షిత్, పాయల్ రాజ్ పుత్, రమ్యకృష్ణ, నదియా లు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇక వారు తమ అభిమానులను ప్రజలను వ్యాక్సిన్ తీసుకోవాలిసింది గా సోషల్ మీడియా ద్వారా కోరారు. ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు, హీరోయిన్స్ కరోనా భారీన పడి తిరిగి కోలుకున్నారు.
