ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న థియేటర్లకు కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ కు ఓకే చెప్పింది. అక్టోబర్ 15 నుండి థియేటర్లను అన్లాక్ చేసేందుకుగాను గైడ్ లైన్స్ విడుదల చేసింది. దియేటర్ లను కేవలం 50 శాతం ఆక్యుపెన్సీ తో నడిపించాలంటే మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. ప్రత్యేకంగా కొన్ని నియమ నిబంధనలను కూడా సూచించింది. ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకునేలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు షో కు షో కు మధ్యలో కచ్చితంగా థియేటర్ మొత్తం శానిటైజేషన్ చేయాల్సి ఉంటుంది.
థియేటర్ కు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా టెంపరేచర్ చెక్ చేయడంతో పాటు ఎలాంటి కరోనా లక్షణాలు ఉన్నాకూడా గుర్తించేందుకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించాలని అంటూ గైడ్ లైన్స్ ను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం విధించిన గైడ్ లైన్స్ పాటించకుండా థియేటర్లో ఓపెన్ చేసినట్లయితే సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుందని అందులో పేర్కొన్నారు. బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ ఇలా అన్ని సినిమా పరిశ్రమను కూడా థియేటర్లు ఎప్పుడు ఎప్పుడు ఓపెన్ అవుతాయి ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే కొన్ని సినిమాలు డిజిటల్ మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాగా మరికొన్ని మాత్రం థియేటర్లోనే విడుదల చేయాలని భీష్మించుకు కూర్చున్నాయి. తెలుగులో చాలా సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. దసరాకు కనీసం పది సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే విషయంలో ఇంకా స్పష్టత లేదు. దాదాపు ఏడు నెలల తర్వాత థియేటర్లు ఓపెన్ అయినా ప్రేక్షకులు మాత్రం ఆసక్తితో లేరు అని చెప్పుకోవచ్చు.
ప్రేక్షకులు కరోనా కు భయపడి థియేటర్లకు వస్తారా రారా అనేది సందేహంగా ఉంది. దసరా సీజన్ వరకు ప్రేక్షకులు మామూలుగా వచ్చిన సంక్రాంతి వరకు అయితే పూర్తి స్థాయిలో కలెక్షన్లు రావడం తో పాటు వంద శాతం ఉంటుందని థియేటర్ల యాజమాన్యాలు ఆశాభావంతో ఉన్నారు.