ఎన్టీఆర్, రామ్ చరణ్, ల కాంబినేషన్ లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఈ చిత్రంలో అలియ బట్ట్, ఒలివియా మోరిస్ లు కథానాయకలుగా నటిస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత ఈ చిత్రం రామోజీ ఫిల్మ్ సిటీ లో 50 రోజులపాటుగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా వణికించే చలిలో హిటర్ల సాయంతో షూటింగ్ జరుపుకుంది.
ప్రస్తుతానికి ఫైనల్ ఎపిసోడ్ కి చేరుకుంది. ఎన్‌టిఆర్, రామ్ చరణ్ ల మధ్య వచ్చే క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. ఈ చిత్రం పీరియాడికల్ నేపథ్యం కలిగిన సోషియో ఫాంటసీ చిత్రం గా రాబోతుంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో చర్రి నటిస్తుంటే, కొమురమ్ భీమ్ పాత్రలో తారక్ నటిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క విడుదల తేదిపై నిన్ననే రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
అక్టోబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగ రిలీజ్ అవ్వుతుంది. ఈ చిత్రం అప్పుడే తన బిజినెస్ చెయ్యడం మొదలు పెట్టింది. ఈ చిత్రం యొక్క తెలుగు, తమిళ ఓవర్సీస్ రైట్స్ ను ఫారస్ ఫిల్మ్స్ 68 కోట్లకు దక్కించుకుంది. ఈ చిత్రం నుండి చరణ్, ఎన్‌టిఆర్ ల టీజర్స్ కు ప్రపంచ వ్యాప్తంగ విపరీతమైన స్పందన రావడంతో అ మొత్తంకు రైట్స్ అమ్ముడు పోయాయి. ఈ చిత్రంలో సముద్రఖని, అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.