![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2020/11/thavasi-dies.jpg?resize=500%2C328&ssl=1)
కోలీవుడ్ ఇండస్ట్రీ లో విషాదం ఛాయలు అల్లుకున్నాయి. ప్రముఖ కమెడియన్ తావసి కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ఈయన సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. తావసి బక్కచిక్కిపోయిన ఆకారం చూసి తమిళ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు షాక్కు గురయ్యారు. ఆయన కోలుకోవాలని ఆకాంక్షించారు. దేవుడిని ప్రార్థించారు. కానీ, ఆ ప్రార్థనలు ఫలించలేదు. తావసి ప్రాణాలు నిలవలేదు. తమిళంలో 140 సినిమాల్లో పైగా నటించిన తావసి దీన స్థితిలో మరణించడం అందరినీ కలచివేస్తోంది.
‘వరుతపడత వలిబార్ సంగం’, ‘సీమరాజా’, ‘రజినీమురుగన్’ తదితర చిత్రాల్లో తావసి నటించారు. ‘వరుతపడత వలిబార్ సంగం’ సినిమాలో తావసి పోషించిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమాలో నటుడు సూరికి తావసి తండ్రిగా నటించారు. కాగా, తావసి మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.