యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ బాలనటుడిగా ఆయన నటించిన మొదటి చిత్రనికే జాతీయ అవార్డ్ గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఆయన నటించిన మూడు చిత్రాలకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ ను గెలుచుకున్నాడు. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు తెలుగు, తమిళ, హింది, లలో మంచి విజయాలను సాదించి ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. క్రమ క్రమంగా ఎదుగుతూ.. తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించాడు.
మక్కల్ నిధి మయ్యం అనే పార్టీని కూడా స్థాపించాడు. ప్రస్తుతం అక్కడ అసెంబ్లి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆయన చెన్నయ్ లోని శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ లో జాయిన్ అయ్యాడు. కమల్ కు ఏమైందని ఆయన అభిమానులు ఆలోచనలో పడ్డారు. ఆయన కాలి వేలు నొప్పి ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ అవ్వడంతో ఆయన హాస్పిటల్ లో జాయిన్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆసుపత్రి సిబ్బంది ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.
కమల్ క్షేమంగానే ఉన్నారని ఆయన కాలి వెలిబోను కి శస్త్రచికిత్స చేయించుకున్నారు. త్వరలోనే కోలుకుంటున్నారని ఆరోగ్య సిబ్బంది తెలిపింది. పార్టీ ప్రచారంలో బాగంగా ఆయన ఈ మధ్య పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. అందుకే కాలి వెలి నొప్పి ఎక్కువ అయినట్లుగా తెలుస్తుంది. పార్టీ పనుల్లో బాగంగా త్వరలోనే అసెంబ్లి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. ఇక కమల్ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ఇండియన్ చిత్రానికి సీక్వెల్ గా ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. విక్రమ్ ఐ సినిమాతో ఫ్లాప్ ను చవిచూసిన ఈ దర్శకుడు ఇండియన్ 2 తో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.