తమిళ స్టార్ హీరో శింబుకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం డ్రమ్ములా ఉండే సిలంబరసన్ సన్నగా కరెంటు తీగలా మారిపోయాడు. ఇందు కోసం ఆయన ఎంతగానో శ్రమించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. శింబు చాలా రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉన్నాడు. మధ్యలో కరోనా రావడంతో… పూర్తి విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సమయంలోనే ఒక్క సారిగా 110 కిలోల బరువు పెరిగాడు. దీన్ని తగ్గించుకునేందుకు విపరీతంగా కష్టపడ్డాడు. ఈ కష్టాన్ని చూపించే వీడియోనే ద జర్నీ ఆఫ్ ఆత్మన్… గా వచ్చిది.
39 ఏళ్లున శింబు.. ప్రేమ నాశనం కాదు అనే సినిమాతో సినీ రంగంలోకి వచ్చాడు. తన టాలెంట్ తో కొద్ది సమయంలోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే కాల్ షఈట్లు ఇవ్వకపోవడం.. షూటింగ్ కి సరైన సమయానికి రాకపోవడం వంటి కారణాలతో తీవ్ర స్థాయిలో విమర్శల పాలయ్యాడు. తర్వాత అతడికి ఎవరూ సినిమాలు ఇవ్వలేదు. ఇక అంతా అతని పని అయిపోయింది అనుకున్న సమయంలోనే… కరోనా కారణంగా రోజుకు నాలుగు బిర్యానీలు తింటూ విపరీతంగా బరువు పెరిగిపోయాడు.
మళ్లీ ఎవరూ ఊహించని విధంగా సన్నగా మారేందుకు కసరత్తులు మొదలు పెట్టాడు. పూర్తి వెజిటీరియన్ గా మారి… రోజు ఎక్సర్ సైజులు చేశాడు. 105 కిలోల బరువు నుంతి 72 కిలోలకు వచ్చాడు. ఇవన్నీ ఓ వీడియోగా మలిచి ద జర్నీ ఆఫ్ ఆత్మన్ అని పుట్టి రోజున వీడియోోని తన ఇన్ స్టాలో షేర్ చేశాడు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు అంతా శింబు పట్టుదలకు హాట్సాప్ చెబుతున్నారు. ఇంత ఈజీగా బరువు తగ్గడంపై అందరూ అభినందనల వెల్లువ కురిపిస్తున్నారు. ఇంత త్వరగా అంత బరువు తగ్గడం చాలా కష్టమంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.