సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూరరై పోట్రు’ తెలుగులో ఈ చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదల అయ్యింది. థియేటర్స్ మూతపడడం తో ఈ చిత్రాన్ని ఓటీటీ మాధ్యమం అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 12 విడుదల అయ్యింది. అపర్ణ బాల మురళి హీరోయిన్‌గా నటించారు. ఎయిర్ డెక్కన్ అధినేత గోపీనాథ్ జీవితగాథను ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్రమిది. కలెక్షన్‌కింగ్ మోహన్‌బాబు ఇందులో కీలక పాత్రలో నటించారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం, నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. చాలా కాలంగా మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా తో ఆ ఆశ తీరింది.
ఈ సినిమా పట్ల సినీ ప్రేక్షకులు, సెలబ్రిటీలు, విమర్శకుల ప్రశంసలు పొందుతుంది. ముఖ్యంగా సూర్య నటన మరో లెవల్ అంటున్నారు. అయితే సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ అభిమానులు చిన్న నిరాశలో ఉన్నారు. ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేసి ఉంటే సులువుగా 100 కోట్లు రాబట్టేందని అంటున్నారు. ఇక సూర్యనే ఈ చిత్రాన్ని నిర్మించాడు కాబట్టి కొద్దీ రోజులు ఎదురు చూసి థియేటర్ లో రిలీజ్ చేస్తే బాగుండు అంటున్నారు.
తాజాగా ఈ విషయం పై సూర్య స్పందించారు. సినిమాను ఓటీటీ లో విడుదల చేయడానికి కారణాన్ని వివరించాడు. ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయడానికి ప్రధాన కారణం ఆర్థికపరమైన ఇబ్బందులు. ఈ సినిమాను నేను నిర్మించినప్పటికి చాలా మంది పెట్టుబడి పెట్టి ఉన్నారు. వారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నా చుట్టు ఉన్న వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఓటీటీకి ఒప్పుకోవాల్సి వచ్చిందని సూర్య క్లారిటీ ఇచ్చాడు.