తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా సిరతయి శివ దర్శకత్వంలో అన్నాతై సినిమా రూపొందుతున్న సంగతి అందరికి తెలిసింది. ఈ చిత్రం యొక్క షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుండి రజినీకాంత్ అనారోగ్యానికి గురి అవ్వుతున్న సంగతి అందరికి తెలిసిందే. మొదట్లో అనారోగ్యం పాలు అయిన రజినీకాంత కొన్ని రోజులు సినిమా షూటింగులకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించడంతో చెన్నైలోనే అయిన విశ్రాంతి తీసుకుంటున్నారు. కొంత విరామం తర్వాత రజినీకాంత్ మరల అన్నాతై షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
కోలివుడ్ మీడియా నుండి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం యొక్క షూటింగ్ చిత్రీకరణలో రజినీకాంత్ కు తోడుగా వైద్యులు కూడా అందుబాటులో ఉంటున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకు అంటే రక్తపోటు విషయంలో హెచ్చు తగ్గులు ఉండటంతో డాక్టర్స్ అందుబాటులో ఉండవలిసి వస్తుంది. ఇక ఈ చిత్రం యొక్క విషయానికి వస్తే ప్రకాష్ రాజ్, మీనా,ఖుష్భు సుందర్ లు కీలక పాత్రలో నటిస్తున్నారు. కీర్తి సురేశ్, నయనతార లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఇటీవలే టాలీవుడ్ హీరో జగపతి బాబు కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడం జరిగింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిది మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. నవంబర్ 4వ తేదీన ఈ చిత్రం విడుదల అవ్వుతుంది. దర్బార్ చిత్రం తో మంచి విజయం సాదించి ట్రాక్ లోకి వచ్చాడు సూపర్ స్టార్ రజినీకాంత్.