
va va ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై శ్రావణ్ రెడ్డి మరియు డాక్టర్ చైతన్య రెడ్డి సమర్పణలో డాక్టర్ చైతన్య రెడ్డి దర్శకత్వంలో సాయి కేతన్ రావు కథానాయకుడుగా నిర్మించిన Strangers(స్ట్రేంజర్స్) సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు డాక్టర్ చైతన్య రెడ్డి మాట్లాడుతూ .. ప్రేక్షకులు ఈ సినిమాని చూస్తూ మంచి అనుభూతిని పొందుతారు. త్వరలో ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేస్తామని తెలిపారు. ఈ చిత్ర పోస్టర్ విడుదల సందర్భంగా చిత్ర బృందానికి తన కృతజ్ఞతలు తెలియజేశారు
*చిత్ర కథానాయకుడు సాయి కేతన్ రావు మాట్లాడుతూ.* .. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అని తెలిపారు.

చిత్ర నిర్మాతల్లో ఒకరైన శ్రావణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ ని మరియు సాంగ్స్ ని త్వరలో రిలీజ్ చేస్తామని, పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలిపారు.
ఈ సినిమాని త్వరలో ఓ.టి.టి ప్లాట్ ఫారంలో ఏప్రిల్ నెలలో విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపారు.



