శృతి హాసన్, కమల్ హాసన్ మరియు సారికా ఠాకూర్ ల కూతురు. తల్లి తండ్రులు విడిపోవడంతో ఎక్కువగా తండ్రి వద్దనే ఉంటుంది. ఇక ఆమె సిస్టర్ అక్షర హాసన్ కూడా అక్కతోనే కలిసి ఉంటుంది. అయితే శృతి హాసన్ ప్రస్తుతం తండ్రికి దూరంగా తాను ఓ కొత్త ఇల్లు కొనుక్కొని అందులోనే నివాసం ఉంటుంది. తండ్రి కమల్ హాసన్ ఓ పెద్ద స్టార్ హీరో సినిమా సినిమాకు కోట్లల్లో రెమ్యూనరేషన్ ఉంటుంది. అయిన కూతురు శృతి హాసన్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్నట్లుగా సంచలన వ్యాఖ్యలు చేసింది.
నాకు సాయం చేయడానికి ఎవరు లేరు. ముఖ్యంగా నా తల్లితండ్రుల మీద ఆదారపడి నేను బ్రతకాలనుకోవడం లేదు. సొంతంగా కష్టపడి జీవించాలి అనుకుంటున్న. నేను పనిచేస్తేనే నాకు డబ్బులు వస్తాయి అని అంది. కరోనా వలన నేను ఒప్పుకున్న సినిమా షూటింగులు మొత్తం ఆగిపోయాయి. ఆయా సినిమాల నుండి మరల నాకు గ్రీన్ సిగ్నల్ వస్తే తప్పకుండ నటిస్తాను. అది కరోనా ఉన్న కానీ తప్పదు.
ఆర్థిక ఇబ్బందులు నాకేమీ కొత్త కాదు నా జీవితంలో చాలా సార్లు ఎదుర్కున్నాను. ఆర్థికంగా నా కాళ్లపై నేను నిలబడాలి అనేది నా మనస్తత్వం. ఇల జీవిస్తునందుకు చాలా హ్యాపీ గా ఉందని అంది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ హీరోగా సలార్ అనే పాన్ ఇండియా మూవీ లో నటిస్తుంది. ఈ చిత్రానికి కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు.