గత వారం రోజులుగా సోషల్ మీడియా లో , యూట్యూబ్ లో ఎక్కడ చూసిన మెగా వేడుక గురించే చర్చ. మెగా డాటర్ నిహారిక పెళ్లి బుధువారం రాజస్థాన్ లోను ఉదయపూర్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుక కు మెగా ఫ్యామిలీ తో పాటు అల్లు ఫ్యామిలీ సైతం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఈ వేడుక ను మీడియా వారు , యూట్యూబ్ వారు బాగా వాడుకున్నారు. దీనిని మెగా అభిమానులు ఎంజాయ్ చేయగా..శ్రీ రెడ్డి కి మాత్రం బాగా కాలింది. అంతే ఒక్కసారిగా యూట్యూబర్లపై సెటైర్స్ వేసి వార్తల్లో నిలిచింది.
”యూ ట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు.. పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఆయనొచ్చాడు, ఈయనొచ్చాడు, ఆయన డాన్సులు చేశాడు.. ఏంట్రా? ఏదైనా ఉపయోగపడే పని చేయండిరా. ఆ రైతులు రోడ్లమీదకొచ్చి ఏడుస్తుంటే సపోర్ట్ చేయడం తెలియదు కానీ ఈ చెత్త మాత్రం షేర్స్ కొట్టుకుంటూ అబ్బా! అనడం.. ఛీ, చేంజ్ కండిరా” అంటూ శ్రీ రెడ్డి ఫైర్ అయింది. అంతటితో ఆగక.. మీడియా కూడా దీన్ని అంత హైలైట్ చేయాల్సిన పని లేదని, దేశంలో హైలైట్ చేయాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయంటూ రెచ్చిపోయిన శ్రీ రెడ్డి చివరగా పనికిరాని ఎదవల్లారా! అంటూనే తప్పించుకునే ప్రయత్నం చేసింది. నేనన్నది మీడియాను కాదు.. ఇలాంటి పెళ్లిళ్లన్నీ చూసేవాడిని అంటున్నా.. పోరా అంటూ ముగించింది.