బుల్లితెర ఫై రాములమ్మ గా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న యాంకర్ శ్రీముఖి..ప్రస్తుతం డేటింగ్ లో ఉందనే వార్తలు ఫిలిం సర్కిల్లో వైరల్ గా మారాయి. అదుర్స్, సూపర్ సింగర్ 9 అనే కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి పలువురు అభిమానుల్ని సంపాదించుకుంది. ఆ తర్వాత 2012 లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలు రాజీ పాత్రతో సినిమా రంగంలోకి ప్రవేశించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత పవన్ సాదినేని దర్శకత్వంలో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో కథానాయికగా నటించింది. నేను శైలజ సినిమాలో హీరో రామ్ కు సోదరిగా నటించింది. ఇలా వెండితెర ఫై వచ్చిన అవకాశాల్లో నటిస్తూనే ..బుల్లితెర ఫై విపరీతమైన పాపులార్టీ సొంతం చేసుకుంది.
తన అందం, అభియనంతో ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టే ఈ భామ రిలేషన్ షిప్ లో ఉన్నట్టు ఓ వార్త ప్రస్తుతం ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. శ్రీముఖి ఓ వ్యక్తితో డేటింగ్ లో ఉన్నట్టు జోరుగా ప్రచారం నడుస్తుంది. అయితే ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. ఇదిలా ఉంటే ఈ వార్తలపై శ్రీముఖి ఇప్పటివరకు స్పందించలేదు. ఇంతకీ శ్రీముఖితో రిలేషన్ షిప్ ఉన్న ఆ లక్కీ బాయ్ ఎవరై ఉంటారా..? అంటూ..శ్రీముఖి ఫాలోవర్లు, అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు.