కరోనా వైరస్, చైనా నుండి ఇండియా కు వ్యాపించిన సమయంలో దాని నియంత్రణకు ఇండియన్ గవర్నమెంట్ సడన్ గా లాక్ డౌన్ ను విదించింది. ఆ సమయంలో ఎంతో మంది వలస కార్మికులు ఇబ్బందులు పడ్డారు. తినడానికి తిండి లేదు చేసుకోవడానికి పని లేదు. చాలా మంది కార్మికులు విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఇరుక్కున్నారు. వారికి ఏమి చేయాలో ఈ సమయంలో ఎటు పోవాలో పాలు పోలేదు. అలాంటి సమయం వచ్చినప్పుడు దేవుడిలా దిగివచ్చాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్.
ఎంతో మంది కార్మికులను తన సొంత డబ్బుతో వారి వారి సొంత ఇండ్లలకు ప్రత్యేకమైన బస్ లు విమాన సర్వీస్ ల ద్వారా పంపించాడు. అక్కడితోటే ఆయన ప్రయాణం ఆగిపోలేదు. ఆపదలో ఉన్న ఆదుకో సోనూ సూద్ అన్న.. అన్న చాలా మందికి సహాయం చేశాడు. ఇండియా లో సోనూ సూద్ ను చాలా మంది తమ ఇంటి బిడ్డలాగే చూస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది వెళ్లలో కరోనా కేసులు నమోదు అవ్వుతున్నాయి. సెలబ్రేటీల నుండి రాజకీయనాయకుల వరకు కరోనా భారీన పడుతున్నారు.
తాజాగా సోనూ సూద్ కు కూడా కరోనా సోకింది. ఈ రోజు మార్నింగ్ కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోగ పాజిటివ్ అని తేలింది ఈ విషయాన్ని అయిన తన అధికారిక సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా తెలియజేశాడు. అలాగే కరోన నుండి త్వరగా కోలుకోవడానికి మీ ప్రార్థనలు కావాలని కోరాడు. తనకు తానుగా సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్ళాడు. అక్కడే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. మీరు బాదపడకండి మీ సమస్యలను తెలుసుకోవడానికి నాకు మరింత సమయం దొరికింది. మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి సాల్వ్ చేద్దాం అంటూ ట్వీట్ చేశాడు. తెలుగులో సోనూ సూద్ చిరంజీవి ఆచార్య చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.