తెలుగు, తమిళ, హింది, కన్నడ, మలయాళ బాషల్లో హీరోయిన్ గా నటించిన సిమ్రాన్ దాదాపుగా 200 సినిమాల్లో నటించింది. సిమ్రాన్ డేట్స్ కోసం అప్పటి తరం కుర్ర హీరోలు సైతం తమ సినిమాలో హీరోయిన్ గా నటింపచేసేందుకు పోటీపడేవారు. పెళ్లి తర్వాత సిమ్రాన్ చాలాకాలం సినిమాలకు దూరం గా ఉంది. ఈ మధ్యనే మరల రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే అంతటి స్టార్ హీరోయిన్ అయిన సిమ్రాన్ కు ఓ చెల్లెలు కూడా ఉంది. ఆమె కూడా చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. చేసింది తక్కువ సినిమాలే అయిన అనతి కాలంలోనే మంచి పేరు ను తెచ్చుకుంది.
ఆమె మరేవరో కాదు మోనల్ నావల్. తెలుగులో పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన బద్రి సినిమా ను తమిళ రీమేక్ లో విజయ్ హీరోగా నటించాడు. ఆ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆమెకు అక్కడ అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ కథల ఎంపికలో ఆమె చేసిన పొరపాట్లు వలన ఆమెకు వరస పరాజయాలు చవి చూడాలిసి వచ్చింది. 20 ఏండ్ల వయసులోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సిమ్రాన్ చెల్లెలు కొన్ని పర్స్నల్ కారణాల వలన ఆత్మహత్య చేసుకుంది.
ఎందుకు ఆమె అల చేసుకుంది అనే కారణం మాత్రం ఎవరికి తెలియదు. తెలుగులో ఒక్కటి రెండు, హిందీలో ఓ రెండు సినిమాలు, మాత్రమే ఆమె నటించింది. 2002 వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన ఆమె చనిపోయింది. అక్క సిమ్రాన్ మాత్రం మరల సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రజినీకాంత్ తో ఆ మధ్య దర్భార్ అనే చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం “రాకేట్రీ : ది నంబి ఎఫెక్ట్ అనే చిత్రంలో నటిస్తుంది.